ఎత్తు తక్కువగా ఉందని పెళ్లి జరగడం లేదు..! ఎవరెస్ట్‌ శిఖరాన్ని ఎక్కి నిరసన తెలిపిన యువతి..

|

Sep 15, 2023 | 7:33 PM

కట్నం కోసం ఇంత పెద్దమొత్తంలో ఖర్చు పెట్టే బదులు తన సంతోషం కోసం ప్రయాణం చేయడమే మంచిదని స్మిత భావించింది. ఆ వెంటనే పర్వతాలు ఎక్కడం ప్రారంభించినట్టుగా చెప్పింది. ఆమె రష్యా, ఆఫ్రికా ఉన్నత శిఖరాలను అధిరోహించింది. తన పెళ్లి కోసం కూడబెట్టిన నగలను అమ్మి ప్రయాణ ఖర్చులు భరించారు. కిలి మంజారో పర్వతాన్ని అధిరోహించింది. 25 నుండి -35 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలలో కూడా ఎత్తైన పర్వతాలను ఎక్కింది.

ఎత్తు తక్కువగా ఉందని పెళ్లి జరగడం లేదు..! ఎవరెస్ట్‌ శిఖరాన్ని ఎక్కి నిరసన తెలిపిన యువతి..
Mountaineer Smita Ghuge
Follow us on

ఎత్తు తక్కువగా ఉండటం వల్ల పెళ్లిని జరగటం లేదు.. దాంతో ప్రపంచంలోనే ఎత్తైన మంచు శిఖరాలను ఎక్కి నిరసన వ్యక్తం చేసింది ఓ యువతి. పూణేకు చెందిన పర్వతారోహకురాలు స్మితా ఘుగే రష్యాలోని ఎల్బ్రస్ పర్వతాన్ని విజయవంతంగా అధిరోహించారు. ఆగస్టు 15న పూణేకు చెందిన స్మితా ఘుగే రష్యాలోని ఎత్తైన శిఖరంపై 75 అడుగుల త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి మరో శిఖరాన్ని అధిరోహించారు. ఎత్తు తక్కువగా ఉండడం వల్ల చిన్నప్పటి నుంచి నిత్యం వేధింపులకు గురైనట్టుగా తాను వాపోయింది. పెళ్లి కోసం అబ్బాయిని వెతుకుతున్నప్పుడు, చాలా మంది అబ్బాయిలు తన ఎత్తును సమస్యగా చూపించేవారని, ఎత్తు తక్కువగా ఉందని, వరకట్నం ఎక్కువగా కావాలని పెళ్లికి నిరాకరించేవారని చెప్పింది. పెళ్లికి ఎత్తు అడ్డంకులు రావడంతో ఆమె తీవ్ర నిరాశకు గురైంది. అయితే ఆమె అక్కడితో ఆగలేదు. మన ఎత్తు తక్కువగా ఉండడం వల్ల ఏమైంది, ఇప్పుడు మన ఎత్తును పెంచలేం.. కానీ కచ్చితంగా ఉన్నత శిఖారాలకు చేరుకోవచ్చునని సంకల్పించుకుంది…పూణెకు చెందిన ఓ యువతి తన ఎత్తుతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని భావించింది. అప్పుడు ఆమె కలల ప్రయాణం మొదలైంది.

కట్నం డిమాండ్ కు వ్యతిరేకంగా స్మిత ప్రయాణం మొదలైంది. అబ్బాయిల కుటుంబాల నుంచి కట్నం డిమాండ్ ఆగడం లేదని గ్రహించిన స్మిత, ఏడు ఖండాల్లోని ఏడు ఎత్తైన శిఖరాలపై దానికి వ్యతిరేకంగా ప్రచారం చేయాలని నిర్ణయించుకుంది. లాక్‌డౌన్‌లో ఆమె ఈ యాత్రలను ప్రారంభించింది. కేవలం చిరునవ్వుతో రష్యాఎల్బ్రస్ పర్వతం శిఖరానికి చేరుకుంది. అంతేకాదు..మహారాష్ట్ర, భారతదేశం గర్వాన్ని చాటిచెప్పడానికి, స్మిత ఆగస్టు 15న ఇక్కడ 75 అడుగుల త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది. ఎల్బ్రస్ పర్వతం ఎత్తు 5642 మీటర్లు అంటే 18,510 అడుగులు. మైనస్ 25 నుండి 35 డిగ్రీల ఉష్ణోగ్రత, ఈదురు గాలుల ప్రతికూల పరిస్థితులలో స్మిత సంకల్పం, కృషితో మాత్రమే ఆరోహణను పూర్తి చేసింది. ఇది మాత్రమే కాదు, ఆమె మరత్మోలి నౌవారిలో చీర ధరించి ఈ జెండాను ఎగురవేసింది.

స్మిత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..తనకు వచ్చిన పెళ్లి సంబంధంలో.. ఇరు కుటుంబాల సమావేశం తర్వాత తనకు అబ్బాయి ఇంటి నుంచి కాల్ వచ్చిందని చెప్పారు. తన కోడలుకు రూ.20 లక్షలు కట్నం వచ్చిందని, అందుకే రూ.18 లక్షలు ఆశిస్తున్నట్లు చెప్పారు. దాంతో స్మిత ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించింది. ఒక్క రూపాయి కూడా కట్నంగా ఇవ్వనని అబ్బాయితో తేల్చి చెప్పింది. కట్నం కోసం ఇంత పెద్దమొత్తంలో ఖర్చు పెట్టే బదులు తన సంతోషం కోసం ప్రయాణం చేయడమే మంచిదని స్మిత భావించింది. ఆ వెంటనే పర్వతాలు ఎక్కడం ప్రారంభించినట్టుగా చెప్పింది.

ఇవి కూడా చదవండి

చదువు పూర్తయిన వెంటనే.. తన తండ్రికి పెళ్లికి కాల్స్ రావడం మొదలైందని చెప్పింది. అప్పుడు అమ్మాయి గ్రాడ్యుయేషన్ మాత్రమే చేసిందని చిన్న చూపు చూసేవారు. దాంతో స్మిత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేసింది. అయినా కూడా తనకు తిరస్కరణలే వచ్చాయని చెప్పింది. అప్పుడు ఉద్యోగం లేదని ఇలా మరోకటి. దీంతో తనలోని లోటుపాట్లన్నీ ఒక్కొక్కటిగా తీర్చుకున్నానని చెప్పింది. కానీ, ఆ తరువాత.. తన ఎత్తుకు సంబంధించి తిరస్కరణలు రావడం మొదలైంది. ఇప్పుడు తన ఎత్తును పెంచలేనని గ్రహించిన స్మిత..కఠిన నిర్ణయం తీసుకుంది. తన ఎత్తును పెంచుకోలేను.. కానీ, తన విజయాలతో ఉన్నత వ్యక్తిత్వాన్ని ఖచ్చితంగా ఎలివేట్ చేసుకోవచ్చునని గ్రహించింది.

ఆమె రష్యా, ఆఫ్రికా ఉన్నత శిఖరాలను అధిరోహించింది. తన పెళ్లి కోసం కూడబెట్టిన నగలను అమ్మి ప్రయాణ ఖర్చులు భరించారు. కిలి మంజారో పర్వతాన్ని అధిరోహించింది. 25 నుండి -35 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలలో కూడా ఎత్తైన పర్వతాలను ఎక్కింది. స్మిత ఎవ్వరూ పైకి వెళ్లలేని ప్రదేశానికి అంటే ఎత్తైన శిఖరానికి వెళ్లాలనుకుంది. కఠోర శ్రమ, కృషితో అనుకున్నది సాధించింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..