ఏంది మావ వీళ్లు ఇలా తయారయ్యారు.. కూతురి మామతో లేచిపోయిన మహిళ

ప్రస్తుతం జంపింగ్‌ జపాంగ్‌ల సమయం నడుస్తోంది... మొన్న కూతురికి కాబోయే భర్తతో మహిళ జంప్ అయిన విషయం తెలిసిందే. 10 రోజుల్లో కాళ్లు కడిగి కన్యాదాన చేయాల్సిన అత్త కాబోయే అల్లుడితో వెళ్లిపోయింది.. అంతేకాదు..అల్లుడినే పెళ్లాడతానని..అతనితోనే తన జీవితమని తెగేసి చెప్పింది. ఇలాంటిదే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ మహిళ కూతురి మామగారితో వెళ్లిపోయంది. ఈ రెండు ఘటనలూ ఉత్తప్రదేశ్‌లోనే జరిగాయి.

ఏంది మావ వీళ్లు ఇలా తయారయ్యారు.. కూతురి మామతో లేచిపోయిన మహిళ
Mamta - Shailendra

Updated on: Apr 19, 2025 | 11:34 AM

అలీగఢ్‌కు చెందిన మహిళ తన కూతురికి కాబోయే భర్తతో పరారైన ఘటన మరవకముందే, ఉత్తరప్రదేశ్‌లోని బదాయూలో దీనిని తలదన్నే ఘటన వెలుగులోకి వచ్చింది. మమత అనే 43 ఏళ్ల మహిళ తన కూతురి మామ శైలేంద్ర(46) అలియాస్ బిల్లుతో పరారైంది. వివరాల ప్రకారం.. మమత భర్త సునీల్ కుమార్ ట్రక్ డ్రైవర్‌గా పనిచేస్తూ నెలలో ఒకటి రెండుసార్లు మాత్రమే ఇంటికి వస్తుండేవాడు. ఈ మధ్యకాలంలో సునీల్ ఇంట్లో లేని సమయంలో మమత తరచుగా శైలేంద్రను ఇంటికి పిలిపించుకునేదని, అతడితో సంబంధం కొనసాగించిందని కుటుంబ సభ్యులు తెలిపారు. మూడు రోజులకోసారి శైలేంద్ర తమ ఇంటికి వచ్చేవాడని, దీంతో తాము రూమును మార్చుకోవాల్సి వచ్చేదని మమత కుమారుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పుడు వాళ్లిద్దరూ కలిసి టెంపోలో పారిపోయారని తెలిపాడు.

తాను కుటుంబ పోషణ కోసం బయటే ఎక్కువ గడపాల్సి వచ్చేదని, క్రమం తప్పకుండా భార్య మమతకు డబ్బులు పంపుతుండేవాడినని, అయితే ఆమె మాత్రం శైలేంద్రతో అక్రమ సంబంధం పెట్టుకుందని ఆరోపించాడు. డబ్బు, బంగారంతో తీసుకొని అతనితో వెళ్లిపోయిందని వాపోయాడు. మహిళ పొరుగింటివారు కూడా సునీల్‌ ఎక్కువగా ఇంటికి వచ్చేవాడు కాదని, ఈ క్రమంలో శైలేంద్ర తరచూ మమత ఇంటికి వచ్చి వెళ్తూ ఉండేవాడని, బంధువు కావడంతో ఎవరూ అనుమానించలేదని తెలిపారు. ఈ ఘటనపై సునీల్ కుమార్ పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, 43 ఏళ్ల మమతకు నలుగురు పిల్లలు ఉన్నారు. వారిలో ఒకమ్మాయికి 2022లో వివాహమైంది. ఈ క్రమంలో కుమార్తె మామ శైలేంద్ర తో సంబంధం పెంచుకున్న మమత అతడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేని స్థితికి చేరుకోవడంతో పరారైనట్టు తెలుస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.