Haunted Railway Station: దెయ్యాలు తిరిగే రైల్వేస్టేషన్‌ ..! అడుగుపెడితే చాలు.. వింత శబ్దాలు, విచిత్ర ఆకారాలు..

|

Dec 09, 2024 | 10:31 AM

ఇక్కడ రైలు ఆగగానే దెయ్యాలు దిగుతాయి. అంతేకాదు..అక్కడ పగలు, రాత్రి ఏ సమయంలోనైనా సరే.. ప్రజలు ఒంటరిగా నడవడానికి కూడా భయపడుతున్నారు. ఈ కారణంగానే 42 ఏళ్లు ఈ స్టేషన్‌ను మూసివేశారు.. పూర్తి వివరాల్లోకి వెళితే..

Haunted Railway Station: దెయ్యాలు తిరిగే రైల్వేస్టేషన్‌ ..! అడుగుపెడితే చాలు.. వింత శబ్దాలు, విచిత్ర ఆకారాలు..
Ghost Railway Station
Follow us on

భారతీయ రైల్వేలు ఆసియాలో రెండవ అతిపెద్ద రైల్వే వ్యవస్థగా చెబుతారు. రోజూ వేల, లక్షల మంది ప్రజలు ఈ రైళ్లలో ప్రయాణిస్తుంటారు. భారతదేశంలో సుమారు 8 వేల రైల్వే స్టేషన్లు ఉన్నాయి. అవన్నీ దేనికదే ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. ప్రతి రైల్వే స్టేషన్‌ పలు కారణాల వల్ల ప్రసిద్ధి ఉంటుంది. అయితే, మనదేశంలో అత్యంత భయంకరమైన రైల్వేస్టేషన్‌ కూడా ఉందని మీకు తెలుసా..? ఇక్కడ రైలు ఆగగానే దెయ్యాలు దిగుతాయి. అంతేకాదు..అక్కడ పగలు, రాత్రి ఏ సమయంలోనైనా సరే.. ప్రజలు ఒంటరిగా నడవడానికి కూడా భయపడుతున్నారు. ఈ కారణంగానే 42 ఏళ్లు ఈ స్టేషన్‌ను మూసివేశారు.. పూర్తి వివరాల్లోకి వెళితే..

బెగుంకోదర్ రైల్వే స్టేషన్: 

దెయ్యాల రైల్వే స్టేషన్‌ అనగానే చాలా మంది ఆశ్చర్యపోతారు.. అదేంటని జోక్‌గా కొట్టి పడేస్తుంటారు. కానీ.. ఈ రైల్వే స్టేషన్ పశ్చిమ బెంగాల్‌లోని పురూలియా జిల్లాలో ఉంది. దీని పేరు బెగుంకోదర్ రైల్వే స్టేషన్. ఇది భారతదేశంలోని అత్యంత హాంటెడ్ రైల్వే స్టేషన్‌లలో ఒకటిగా పిలుస్తారు.. ఇక్కడికి వచ్చే చాలా మంది ప్రయాణికులు తెల్లటి చీరలో ఉన్న ఆడ దెయ్యాన్ని చూశారట. ఇది కాకుండా స్టేషన్‌కు సంబంధించిన అనేక భయానక కథనాలు ఇక్కడ వినిపిస్తున్నాయి. ఈ స్టేషన్‌తో సంబంధం ఉన్న దెయ్యాల ఆత్మ కారణంగా 42 సంవత్సరాలు మూసివేయబడింది. తర్వాత 2009లో మళ్లీ తెరవబడింది.

ఇవి కూడా చదవండి

నైని రైల్వే స్టేషన్:

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాజ్‌లో ఉన్న నైని జంక్షన్ రైల్వే స్టేషన్ కూడా ప్ర‌మాద‌క‌ర రైల్వేస్టేష‌న్‌గా నమ్ముతారు. ఎందుకంటే ఈ రైల్వే స్టేషన్ సమీపంలోనే నైనీ జైలు ఉంది. ఇక్క‌డ దేశ స్వాతంత్ర్యానికి విశేషంగా కృషి చేసిన చాలా మంది స్వాతంత్య్ర సమరయోధులను బ్రిటీష్‌ వారు ఉరితీశారు. ఈ జైలుకు కూతవేటు దూరంలోనే నైని రైల్వేస్టేషన్‌ ఉంది. ఈ స్టేషన్‌లో అలాంటి సంఘటనలు ఏవీ జరగనప్పటికీ ఇక్కడి ప్రజల్లో ఒక వింత నమ్మకం ఉంది. జైల్లో ఉరితీసిన వారి ఆత్మ‌లు ఈ రైల్వే స్టేషన్‌లో తిరుగుతాయని అక్క‌డి ప్ర‌జ‌లు చెబుతున్నారు. రాత్రిపూట ఏడుపు, అరుపుల శబ్దాలు వినిపిస్తున్నాయని పలువురు అంటున్నారు.

ములుంద్ స్టేషన్:

ముంబైలోని ములుంద్ స్టేషన్ దేశంలోని పురాతన రైల్వే స్టేషన్లలో ఒకటి. సాయంత్రం తర్వాత ఇక్కడ వింత అరుపులు, కేకలు వినిపిస్తున్నాయని ఈ స్టేషన్‌ను సందర్శించే వారు చెబుతున్నారు.

బరోగ్ రైల్వే స్టేషన్:

హిమాచల్ ప్రదేశ్ లోని సోలన్ జిల్లాలో ఉన్న బరోగ్ రైల్వే స్టేషన్ కూడా అత్యంత భయంకరమైన రైల్వే స్టేషన్లలో ఒకటిగా పిలుస్తారు. ఈ రైల్వే స్టేషన్ పక్కన ఒక సొరంగం ఉంటుంది. దీనిని బరోగ్ టన్నెల్ అంటారు. వాస్తవానికి ఈ సొరంగం కల్నల్ బరోగ్ అనే బ్రిటిష్ ఇంజనీర్ నిర్మించారు. అనంతరం అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. కల్నల్ బరోగ్ ఆత్మ బరోగ్ సొరంగంలో తిరుగుతున్నట్లు అక్క‌డి ప్ర‌జ‌లు విశ్వ‌సిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..