మీరెప్పుడైనా సర్కస్ కు వెళ్లారా.. అక్కడ రకరకాల జంతువులు ఫీట్లు చేస్తూ మనల్ని అలరిస్తూ ఉంటాయి. వీటిలో అధికంగా కోతులు, కుక్కలు, పిల్లులు ఉంటాయి. వాటికి సరైన ట్రైనింగ్ ఇచ్చి, స్టంట్స్ చేసేలా వాటిని మలుస్తారు. అయితే సర్కస్ లో చేసే రింగ్ డ్యాన్స్ అంటే మనందరికీ ఎంతో ఇష్టం. సర్కస్ పై అమ్యాయిలు చేసే ఈ డ్యాన్స్ ను అలాగే చూస్తూ ఉండిపోతాం. కానీ ఓ కోతి ఇలాంటి డ్యాన్స్ చేసిందంటే మీరు నమ్ముతారా.. అవునండీ ఓ కోతి రింగ్ డ్యాన్స్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ కోతి.. రింగ్ డ్యాన్స్ చేస్తుంది. రింగ్ ను నడుముపై పెట్టుకుని గిరగిరా తిప్పుతూ విశేషంగా ఆకర్షిస్తోంది. సాధారణంగా ఇలా చేయడం చాలా కష్టం. కానీ కోతి ఇలా చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
Best hula hoop ??? pic.twitter.com/sPtA8zoepT
ఇవి కూడా చదవండి— Creature of God (@mdumar1989) July 13, 2022
ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ అయిన ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. దీనికి ‘బెస్ట్ హులా హూప్’ అని టైటిల్ ఇచ్చారు. ఈ వీడియోను పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే 17వేలకుపైగా వ్యూస్ వచ్చాయి. ఈ 11 సెకన్ల వీడియోను ఇంకా చూస్తూనే ఉన్నారు. వందలాది మంది వీడియోను లైక్ చేసి, రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఈ కోతి చాలా బాగా డ్యాన్స్ చేస్తోందని ఒకరు, కోతి డ్యాన్స్ కు ఫిదా అయ్యామని మరొకరు, రింగ్ డ్యాన్స్ ఎలా చేయాలో ఆ కోతి వద్ద ట్రైనింగ్ తీసుకోవాలంటూ రకరకాలుగా ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోన్న ఈ వీడియోను మీరూ చూసేయండి.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి