రాకాసి బల్లి.. ఈ పేరు వింటేనే ఒళ్లు జలదరిస్తుందో కదూ.! చూస్తే ఇంకేమైనా ఉందా.! గుండె ఆగినంత పనవుతుంది. ఈ రాకాసి బల్లులను కొమాడో డ్రాగన్స్(Komado Dragons) అని పిలుస్తుంటారు. వాటికి ఆకలి వేసినప్పుడు.. ఎంతటి పెద్ద జంతువులను అయినా అమాంతం మింగేసి తినేస్తాయి. ఇలాంటి డేంజరస్ జంతువుతో ఓ కొండచిలువ తలబడింది. చివరికి తన ఓటమిని ఎదుర్కుంది. ఇది పాత వీడియో అయినప్పటికీ మరోసారి ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతోంది.
ఓ కెనాల్ లాంటి ప్రదేశంలో రాకాసి బల్లి కొండచిలువను వేటాడే దృశ్యాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఒళ్లు గగుర్పొడిచే విధంగా ఉన్న ఆ దృశ్యాల్లో రాకాసి బల్లి.. కొండచిలువను అమాంతం మింగేసింది. కానీ కొంతసేపటికి ఏం జరిగిందో తెలియదు గానీ.. కొండచిలువ కళేబరాన్ని బయటికి ఊసేస్తుంది రాకాసిబల్లి. ఇక ఇందుకు సంబంధించిన విజువల్స్‌ను ఆ కెనాల్ పైనుంచి పర్యాటకులు తమ మొబైల్ ఫోన్లలో బంధించారు. ఇక ఈ ఘటన సింగపూర్‌లోని ఉలు పండన్ కెనాల్‌లో గతేడాది ఫిబ్రవరి 24న జరిగింది. లేట్ ఎందుకు మీరు కూడా ఓసారి వీడియోపై లుక్కేయండి.