
పాము వర్సెస్ ముంగీస.. ఇవి రెండు ఎదురు పడ్డాయో.. ఇక యుద్దం అనివార్యం అన్నట్టే.. తాజాగా అలాంటి ఘటనకు సంబంధించిన వీడియోనే ఒక ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈ వీడియోలో బద్ద శత్రవులుగా పిలువబడే పాములు, ముంగీసల భీకర యుద్దాన్ని మీరు చూడవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో ప్రకారం.. పట్టపగలు ఒక పాము రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తుంది. కానీ వాహనాలు రాకపోకలు సాగుతుండడంతో అవి ముందుకూ వెనకకూ.. వెళ్తుంది. అప్పుడే పక్కనున్న పొదల్లోంచి ఒక మంగూస్.. పాము వైపు దూసుకొచ్చింది.
పడగ విప్పి ఉన్న పాముపై దాడి చేయడం స్టార్ట్ చేసింది. దాని నుంచి తప్పించుకునేందుకు పాము సైతం తీవ్రంగా శ్రమించింది. దాదాపు చాలా సేపు వీటి రెండింటి మధ్య భీకర యుద్దం జరిగింది. కానీ చివరకు ఈ యుద్దంలో మంగూసే పై చేయి సాధించి.. పామును నోట కరుచుకొని పొదల్లోకి లాక్కెళ్లింది. అక్కడే దూంగా ఉండి ఈ తతంగాన్ని చూస్తున్న కొందరు జనాలు పాము, మంగూస్ ఫైట్‌ను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ట్రెండింగ్‌లోకి వచ్చింది.
shubhhh__official అనే ఇన్‌స్టా అకౌంట్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో చాలా తొందరగా వైరల్‌గా మారింది. పాము వర్సెస్ మంగూస్ మధ్య జరిగిన ఫైట్ సినిమా మించిన థ్రిల్ ఇవ్వడంతో జనాలు దీనిని విపరీతంగా షేర్ చేశారు. దీంతో ఈ వీడియో ఇప్పటి వరకు 5లక్షల 78 వేల 928 వీవ్స్‌ను సాధించింది.
వీడియో చూడండి..
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.