Viral: పుట్టబోయే బిడ్డను చూసేందుకు స్కానింగ్.. రిపోర్ట్స్ చూడగా మైండ్ బ్లాంక్!

| Edited By: Narender Vaitla

Apr 30, 2022 | 3:28 PM

అమ్మ కాబోతున్న ఆ మహిళ.. తనకు పుట్టబోయే బిడ్డ ఎలా ఉందో చూసేందుకు ఆస్పత్రికి వెళ్లింది. అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా..

Viral: పుట్టబోయే బిడ్డను చూసేందుకు స్కానింగ్.. రిపోర్ట్స్ చూడగా మైండ్ బ్లాంక్!
Scan
Follow us on

అమ్మ కాబోతున్న ఆ మహిళ.. తనకు పుట్టబోయే బిడ్డ ఎలా ఉందో చూసేందుకు ఆస్పత్రికి వెళ్లింది. అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా తన బిడ్డ ముఖాన్ని చూడాలని ఎంతో ఆనందంగా ఎదురు చూసింది. రిపోర్ట్స్ రానే వచ్చాయి… అల్ట్రాసౌండ్ స్కాన్ ఇమేజ్‌ను చూడగానే ఒక్కసారిగా ఆమె ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఆమె ముఖంలో సంతోషం కాస్తా పోయింది. ఆ స్టోరీ ఏంటంటే..

వివరాల్లోకి వెళ్తే.. స్కాట్లాండ్‌లోని డన్‌ఫెర్మ్‌లైన్‌కు చెందిన 25 ఏళ్ల తస్మిన్ స్టెన్‌హౌస్ ఐదు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి వెళ్లగా.. అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా తనకు పుట్టబోయే బిడ్డ ఎలా ఉందో చూడాలని అనుకుంది. ఎంతో ఆనందంతో అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకుంది.. ఇక వాటి రిపోర్ట్స్ రాగానే.. అవి చూసి ఒక్కసారిగా షాక్‌కు గురైంది. అల్ట్రాసౌండ్ స్కాన్ బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో శిశువు తల పుర్రెను పోలి ఉండటాన్ని చూసి సదరు మహిళకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఇక ఆ చిత్రాన్ని తస్మిన్ తన భర్తకు చూపించగా.. అతడు పగలబడి నవ్వాడు. తనకు జరిగిన సంఘటనను తస్మిన్ సోషల్ మీడియా ద్వారా నెటిజన్లతో పంచుకుంది. దీనిపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. కాగా, తస్మిన్ 2022 ఫిబ్రవరిలో పండింటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇక ఆ అమ్మాయి ముఖం అందంగా ఉందని.. తస్మినే స్వయంగా చెప్పుకొచ్చింది.