ఏడేళ్ల క్రితం భర్త మిస్సింగ్.. చివరకు బిగ్ బాస్ షో అలా చూసేసరికి మైండ్ బ్లాంక్

|

Feb 02, 2024 | 11:11 AM

కర్ణాటకలోని రామనగరకు చెందిన లక్ష్మణరావు స్థానికంగా ఒక చికెన్ షాపులో పని చేసేవాడు. 2015లో అతను పెద్దలు కుదర్చిన యువతిని పెళ్లాడాడు. ఆ తర్వాతి కాలంలో వారికి ఇద్దరు కుమారులు జన్మించారు. అయితే అప్పులు ఇచ్చినవాళ్ల నుంచి ఒత్తడి పెరగడంతో..  2017లో లక్ష్మణరావు ఇల్లు వదిలి ఎస్కేప్ అయ్యాడు.

ఏడేళ్ల క్రితం భర్త మిస్సింగ్.. చివరకు బిగ్ బాస్ షో అలా చూసేసరికి మైండ్ బ్లాంక్
Bigg Boss (representative image)
Follow us on

ఇది సినిమాకు మించిన రియల్ స్టోరీ. వివరాల్లోకి వెళ్తే..  కర్ణాటకలోని రామనగరకు చెందిన లక్ష్మణరావు స్థానికంగా ఒక చికెన్ షాపులో పని చేసేవాడు. 2015లో అతను పెద్దలు కుదర్చిన యువతిని పెళ్లాడాడు. ఆ తర్వాతి కాలంలో వారికి ఇద్దరు కుమారులు జన్మించారు. అయితే అప్పులు ఇచ్చినవాళ్ల నుంచి ఒత్తడి పెరగడంతో..  2017లో లక్ష్మణరావు ఇల్లు వదిలి ఎస్కేప్ అయ్యాడు. తన భర్త మిస్ అయ్యాడంటూ ఆ గృహిణి ఐజూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు సెర్చ్ చేసినా అతని జాడ మాత్రం తెలియలేదు. అప్పట్నుంచి భర్త గురించి ఆలోచిస్తూ.. తల్లిదండ్రుల సహకారంతో బిడ్డల్ని సాకుతోంది ఆ వివాహిత. అయితే ఇక్కడ అనుకోని ట్విస్ట్ రివీలయ్యింది.

ఇటీవల కన్నడ బిగ్‌బాస్‌ షోకు వీడియోలను టీవీలో చూస్తున్న సమయంలో ఆ గృహిణికి ఒక వ్యక్తిని చూసి డౌట్ కలిగింది. అందులో తన భర్త పోలీకలతో ఓ హిజ్రా ఉన్నట్లు గుర్తించింది. మరోసారి ఆ వీడియోలను పరీక్షగా చూసి.. హిజ్రా రూపంలో ఉంది తన భర్తే అని నిర్ధారించుకుంది. వెంటనే వెళ్లి ఐజూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కన్నడ బిగ్‌బాస్‌ రియాల్టీ షోలో ‘నీతు వనజాక్షి’ అనే హిజ్రా కంటెస్టెంట్‌గా వెళ్లింది. పోటీ నుంచి బయటకు వచ్చిన ఆమెకు మైసూరులో హిజ్రాల సంఘాలకు చెందిన కొందరు ప్రతినిధులు స్వాగతం పలికారు. ఆ సమయంలో రష్మిక అనే హిజ్రా తీసిన రీల్స్‌లోనూ లక్ష్మణ్‌ను పోలిన హిజ్రా ఉంది.

ఆ వీడియో ఆధారంగా ఐజూరు పోలీసులు రంగంలోకి దిగారు. తొలుత రష్మికను సంప్రదించి, వీడియోలో కనిపించిన పర్సన్ ఆచూకీ అడిగారు. ‘ఆమె’ పేరు విజయలక్ష్మి అని తెలిపిన రష్మిక.. ఇత వివరాలు వెల్లడించింది. అక్కడికి వెళ్లిన పోలీసులు విజయలక్ష్మిని అదుపులోకి తీసుకుని ఐజూరు పోలీస్ స్టేషన్‌కు తీసుకు వచ్చారు. తాను లక్ష్మణరావును కాదని, విజయలక్ష్మిని అంటూ తొలుత వాదించాడు. అయితే అతని ఒంటిపై ఉన్న పుట్టుమచ్చల్ని భార్య పక్కాగా చెప్పకడంతో… చివరకు తాను లక్ష్మణరావునని ఒప్పుకోవాల్సి వచ్చింది. తాను లింగ మార్పిడి చేయించుకున్నానని చెప్పడంతో.. భార్య మూర్ఛపోయింది. భార్యా, బిడ్డలను అనాథల్లా వదిలేసి.. వెళ్లేందుకు మనసు ఎలా అంగీకరించిందని ప్రశ్నించగా..  తనకు ఫ్యామిలీ కన్నా, హిజ్రా జీవితమే బాగుందని చెప్పాడు. పోలీసులు చెప్పినా ప్రయోజనం లేకపోవడంతో.. లక్ష్మణరావుతో ఒక పత్రాన్ని రాయించుకుని పోలీసులు పంపించేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..