Watch Video: కదులుతున్న బస్సును తలతో ఢీకొట్టిన యువకుడు.. అతను చెప్పిన కారణమేంటో తెలిస్తే..

|

Nov 10, 2022 | 2:51 PM

నడిరోడ్డుపై ఓ యువకుడు చేసిన పని నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. కదులుతున్న బస్సుకు ఎదురెళ్లి మరీ తలతో గుద్దాడు. దీంతో ఏకంగా బస్సు అద్దం బద్ధలయ్యింది. అయితే ఆ యువకుడికి మాత్రం ఎలాంటి హాని జరగకపోవడం విశేషం. బస్సు డ్రైవర్‌ ముందుగానే అలర్ట్‌ అయ్యి స్లో చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది...

Watch Video: కదులుతున్న బస్సును తలతో ఢీకొట్టిన యువకుడు.. అతను చెప్పిన కారణమేంటో తెలిస్తే..
Man Hits Bus Video
Follow us on

నడిరోడ్డుపై ఓ యువకుడు చేసిన పని నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. కదులుతున్న బస్సుకు ఎదురెళ్లి మరీ తలతో గుద్దాడు. దీంతో ఏకంగా బస్సు అద్దం బద్ధలయ్యింది. అయితే ఆ యువకుడికి మాత్రం ఎలాంటి హాని జరగకపోవడం విశేషం. బస్సు డ్రైవర్‌ ముందుగానే అలర్ట్‌ అయ్యి స్లో చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వైరల్‌ వీడియో నెట్టింట్‌ ట్రెండ్ అవుతోంది. ఇంతకీ ఆ యువకు అలా ఎందుకు చేశాడో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.

కేరళలోని మలప్పురం పెరింథాల్‌మన్నలోని జూబ్లీ జంక్షన్‌ వద్ద బుధవారం ఈ సంఘటన జరిగింది. ఆ యువుకుడు మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. రంగంలోకి దిగిన పోలీసులు యువకుడి పేరెంట్స్‌ను పిలిపించి, అనంతరం కోజికోడ్‌లోని మెంటల్‌ హెల్త్‌ సెంటర్‌కు యువకుడిని తరలించారు. బస్సును ఢీకొట్టిన తర్వాత ఆ యువకుడు బస్సులోని స్టీరింగ్‌పై కూర్చొని కాసేపు హడావుడి చేశాడు.

ఇవి కూడా చదవండి

ఇక తాను అసలు అలా ఎందుకు బిహేవ్‌ చేశాడన్న దానికి సంబంధించి ఓ ఆడియో క్లిప్‌ కూడా నెట్టింట వైరల్‌ అవుతోంది. తాను బ్రెజిల్‌ జట్టు ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ని అని, బస్సుకున్న బ్లూ కలర్‌ చూసి అర్జెంటీనా టీం గుర్తుకు వచ్చిందని ఆ కోపంతోనే బస్సును ఢీకొట్టానని గట్టిగా అరిచాడు. దీంతో యువకుడికి ప్రస్తుతం మానసిక వైద్య నిపుణులు చికిత్స అందిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..