Viral Video: ఆ ఆట పేరు చెప్పండయ్యా..! చెంపదెబ్బలతో తలపడిన ప్రత్యర్థులు.. వైరల్ అవుతున్న వీడియో..

|

Jul 05, 2023 | 5:34 PM

Slap Fighting: అందరికీ క్రికెట్ అంటే ఇష్టమే కానీ కబడ్డీ అందే ఏదో తెలియని కనెక్షన్. కుస్తీ పోటీలపై కూడా ఎంతో ఆసక్తి ఉంటుంది. అసలు కబడ్డీ ఎలా ఆడతారో, అందులోని రూల్స్ ఏమిటో అవన్నీ మనకు తెలుసు. కానీ ‘ఇది కబడ్డీయా, కుస్తీ పోటీలా.?’ అనే ప్రశ్న తలెత్తేలా ఓ ఆట

Viral Video: ఆ ఆట పేరు చెప్పండయ్యా..! చెంపదెబ్బలతో తలపడిన ప్రత్యర్థులు.. వైరల్ అవుతున్న వీడియో..
Slap Fight
Follow us on

Slap Fighting: అందరికీ క్రికెట్ అంటే ఇష్టమే కానీ కబడ్డీ అందే ఏదో తెలియని కనెక్షన్. కుస్తీ పోటీలపై కూడా ఎంతో ఆసక్తి ఉంటుంది. అసలు కబడ్డీ ఎలా ఆడతారో, అందులోని రూల్స్ ఏమిటో అవన్నీ మనకు తెలుసు. కానీ ‘ఇది కబడ్డీయా, కుస్తీ పోటీలా.?’ అనే ప్రశ్న తలెత్తేలా ఓ ఆట ఆడారు ఇద్దరు వ్యక్తులు. వారు ఆట ఆడుతున్నారో, లేక పాత పగలను తీర్చుకుంటున్నారో తెలియదు కానీ ఒకరిని ఒకరు చెంపదెబ్బలతో చంపేసుకునేలా కొట్టారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో మీరు ఇద్దరు వ్యక్తులు ఒకరికొకరు చెంప దెబ్బలు కొడుతూ పోటీ పడడాన్ని మీరు చూడవచ్చు.

కబడ్డీ ఆట అయితే ఎప్పుడో ఓ సారి చెంపదెబ్బ తగలవచ్చు. పోనీ కుస్తీ అయితే ప్రత్యర్థిని రెచ్చగొట్టేందుకు ఓ సారి కొట్టే అవకాశం ఉంది. కానీ ఆ వీడియోలో అపకుండా చెంపదెబ్బలు కొట్టుకుంటున్నారు. ఇలా సాగిన ఈ వైరల్ వీడియో ఎక్కడ జరిగిందో తెలియదు కానీ @WonderW97800751 అనే ట్విట్టర్ ఖాతా నుంచి షేర్ అయింది. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి ఆట ఆడలేకపోయినా, తప్పకుండా చూడాల్సిందేనని.. సోషల్ మీడియాలో ఆధిపత్యం కోసం జూకర్బర్గ్, ఎలన్ మస్క్ మధ్య జరిగే ఫైట్‌లా ఉందని, కున్‌ఫూ లాంటి స్లాప్‌ఫూ అయ్యుంటుందని కొందరు అభిప్రాయపడ్డారు. ఇక ఈ వీడియోకు ఇప్పటివరకు దాదాపు 2 లక్షల 20 వేల వీక్షణలు వచ్చాయి.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియో..

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..