
Trending: ఆ మహిళకు పొత్తి కడుపులో విపరీతమైన నొప్పి వచ్చింది. పెయిన్ అస్సలు భరించలేకపోయింది. దీంతో వెంటనే ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ టెస్టులు చేసిన డాక్టర్లు కంగుతిన్నారు. ఆ మహిళ గాల్ బ్లాడర్‌లో భారీ సంఖ్యలో రాళ్లు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఆపరేషన్ చేసి.. చిన్న, పెద్ద సైజులో ఉన్న 1426 స్టోన్స్ రిమూవ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్(Madhya Pradesh)లోని బాలాఘాట్ జిల్లా(Balaghat district) మలంజ్‌ఖండ్ తహసీల్‌లోని బోడా గ్రామానికి చెందిన 55 ఏళ్ల జురాన్‌బాయి మాదవి అనే మహిళ పొత్తి కడుపు నొప్పి, కడుపులో భారంగా అనిపించడం, అజీర్ణం, వాంతులు, ఒళ్లంతా చెమటలు పట్టడం వంటి సమస్యలతో గోండియాలోని బిజె హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌కు వెళ్లింది. వెంటనే ప్రాథమిక పరీక్షలు చేసిన డాక్టర్లు.. మహిళ గాల్ బ్లాడర్ సాధారణం కంటే చాలా ఎక్కువ పరిమాణంలో ఉండటం గుర్తించారు. వెంటనే అల్ట్రాసౌండ్, సీటీ స్కాన్ వంటి పరీక్షలు చేయగా.. లోపల లెక్కలేనన్ని రాళ్లు ఉన్నళ్లు గుర్తించారు. కొన్ని గంటల పాటు ఆపరేషన్ చేశారు. ఊహించని విధంలో లోపల వివిధ పరిణామాల్లో ఉన్న 1426 రాళ్లు తొలగించారు. మహిళ పిత్తాశయం నుండి 1426 రాళ్లను తొలగించడం బహుశా ప్రపంచంలోనే మొదటి కేసు కావచ్చు. ఈ విజయవంతమైన ఆపరేషన్ ద్వారా డాక్టర్ వికాస్ జైన్ పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదయ్యే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గోండియాలోని బిజె హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ అధిపతి డాక్టర్ వికాస్ జైన్‌కు ఇంతకు ముందు సంక్లిష్టమైన, సవాలుతో కూడిన ఆపరేషన్లు చేసిన ఘనత ఉంది. (Source)
మరిన్ని జాతీయ వార్తల కోసం