Watch: ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ రాకెట్ బేస్‌లో అగ్నిప్రమాదం.. ఏం జరిగిందంటే..!

పేలుడు ధాటికి టెస్ట్ స్టాండ్ పూర్తిగా దట్టమైన పొగ, మంటలతో నిండిపోయింది. కొన్ని సెకన్లలోనే మంటలు పెరిగి, పెద్ద పేలుడుకు దారితీశాయి. పేలుడుకు గల కారణాలపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. అత్యవసర సిబ్బంది వేగంగా స్పందించి, నిమిషాల్లోనే మంటలను ఆర్పారు. కాగా, అగ్నిప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డు కాగా, క్షణాల్లో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌పై చక్కర్లు కొట్టాయి.

Watch: ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ రాకెట్ బేస్‌లో అగ్నిప్రమాదం.. ఏం జరిగిందంటే..!
Elon Musks Spacex

Updated on: May 22, 2025 | 3:36 PM

టెక్సాస్‌లోని స్పేస్‌ఎక్స్ మెక్‌గ్రెగర్ పరీక్షా కేంద్రం బుధవారం భారీ పేలుడుతో దద్దరిల్లింది. ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ ఎక్స్‌ టెక్సాస్‌ మెక్‌గ్రెగోర్ బేస్‌లో రాకెట్ ఇంజిన్ టెస్టింగ్ సమయంలో భారీ పేలుడు సంభవించింది. ఆక్సిజన్, మీథేన్ గ్యాస్ లీక్ కావడంతో మంటలు చెలరేగాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చింది. కంపెనీ తాజా రాప్టర్ ఇంజిన్, సాధారణ స్టాటిక్ ఫైర్ టెస్ట్ సమయంలో ఈ సంఘటన జరిగింది. నష్టంపై అధికారిక సమాచారం ఇంకా తెలియరాలేదు.

టెస్టింగ్ ప్రక్రియలో ఏర్పడిన సాంకేతిక లోపం కారణంగా ఇలాంటి అరుదైన ఘటనలు జరుగుతాయని నిపుణులు భావిస్తున్నారు. పేలుడు ధాటికి టెస్ట్ స్టాండ్ పూర్తిగా దట్టమైన పొగ, మంటలతో నిండిపోయింది. కొన్ని సెకన్లలోనే మంటలు పెరిగి, పెద్ద పేలుడుకు దారితీశాయి. పేలుడుకు గల కారణాలపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. అత్యవసర సిబ్బంది వేగంగా స్పందించి, నిమిషాల్లోనే మంటలను ఆర్పారు. కాగా, అగ్నిప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డు కాగా, క్షణాల్లో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌పై చక్కర్లు కొట్టాయి.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి…

అదృష్టవశాత్తూ, ఈ సంఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని తెలిసింది.. కంపెనీ భద్రతా ప్రోటోకాల్‌లు, అగ్నిమాపక వ్యవస్థలు నిమిషాల్లో మంటలను అదుపు చేయడానికి ఎంతగానో శ్రమించారు. అయితే, ఈ సంఘటన ఎంత నష్టాన్ని కలిగించింది. లేదా వారి స్టార్‌షిప్ ప్రోగ్రామ్‌ను ఎలా ప్రభావితం చేస్తుందనే దానిపై స్పేస్‌ఎక్స్ ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..