Marriage in Plane: కరోనా ఎఫెక్ట్.. విమానంలో ఘనంగా పెళ్లి.. ప్రొటోకాల్ మిస్.. ఆ తర్వాత ఏమైందంటే..?

Marriage in charter flight: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. దీంతో అన్ని చోట్ల లాక్‌డౌన్ విధించి కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో శుభకార్యాలకు

Marriage in Plane: కరోనా ఎఫెక్ట్.. విమానంలో ఘనంగా పెళ్లి.. ప్రొటోకాల్ మిస్.. ఆ తర్వాత ఏమైందంటే..?
Marriage In Plane

Updated on: May 24, 2021 | 11:09 AM

Marriage in charter flight: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. దీంతో అన్ని చోట్ల లాక్‌డౌన్ విధించి కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో శుభకార్యాలకు సైతం కోవిడ్ నిబంధనలు పాటించాలని కఠిన ఆంక్షలు విధించారు. అయితే ఇలాంటి ఆంక్షలు ఉన్నాయన్న కారణంతో మధురైకి చెందిన రాకేష్, దక్షిణ విమానంలో పెళ్లి చేసుకున్నారు. పెద్దలందరి ఆశీర్వాదంతో ఒక్కటయ్యారు. విమానంలోనే అంగరంగ వైభవంగా జరిగిన వివాహ తంతుకు సంబంధించిన ఫొటోలు, వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ మేరకు వరుడు, వధువు కుటుంబసభ్యులు ఆదివారం మదురై నుంచి తూత్తుకుడికి రెండు గంటలపాటు విమానంలో ప్రయాణించారు. ఈ వివాహ తంతులో సుమారు 160 మంది పాల్గొన్నారు. మీనాక్షి ఆలయం మీదుగా విమానం.. ఎగురుతున్నప్పుడు వరుడు.. వధువు మెడలో మంగళసూత్రాన్ని కట్టాడు. కరోనా ప్రభావం ఎక్కువగా ఉండడంతో తమిళనాడు ప్రభుత్వం రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్ ప్రకటించింది. దీంతో ఇరు కుటుంబాలు విమానంలోనే వివాహతంతు కానిచ్చేశాయి. కాగా.. ఈ పెళ్లిలో ఎవరూ మాస్కులు పెట్టుకోకపోవడం, భౌతిక దూరం నిబంధనలు పాటించకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కరోనాకు ముందు జరిగిన వివాహం లాగానే పెళ్లి తంతు జరిగిందంటూ.. విమానంలో పెళ్లిపై పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు.

Also Read:

వ్యాక్సిన్ల కొనుగోలులో జాప్యం….ఇప్పటికైనా మేల్కొనాలంటున్న ప్రముఖ వైరాలజిస్ట్, థర్డ్ కోవిద్ వేవ్ రాకుండా జాగ్రత్త పడాలని సూచన

Baba Ramdev: బాబా రామ్‌దేవ్ వివరణపై స్పందించిన కేంద్ర మంత్రి హర్షవర్ధన్.. వివాదాన్ని ముగిద్దామంటూ ట్వీట్