మనకంటే చిన్నవారు మనల్ని ఆంటీ లేదా అంకుల్ అని పిలవడం చాలా సార్లు మనందరికీ జరుగుతుంది. అప్పుడు మనలో చాలా మందికి ఇది ఇష్టం ఉండదు. మమ్మల్ని ఈ పదంతో పిలవవద్దని, బదులుగా అక్కా లేదా అన్న అని పిలవమని వారిని అడుగుతాము. ముంబయి లోకల్ ట్రైన్‌లో ఇలాంటి సంఘటనే జరిగింది. తదుపరి స్టేషన్‌లో రైలు దిగాలనుకున్న వ్యక్తిని తోటి ప్రయాణికుడు అంకుల్ అని సంబోధించాడు. దీనిపై ఆయన చేసిన ఫన్నీ రియాక్షన్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.
వైరల్ అవుతున్న వీడియోలో, ముంబై లోకల్ ట్రైన్ తలుపు దగ్గర ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు. వీడియోలో కనిపించని రెండో వ్యక్తి, పక్కకు వెళ్లి ఇతర ప్రయాణికులను తదుపరి స్టేషన్‌లో దిగేందుకు తనకు కాస్త దారివ్వమని అడిగాడు. అంకుల్ కాస్త అడ్డు జరగండి.. నేను దిగాక మళ్లీ కూర్చోండి అంటాడు.. కానీ, అతనికి ఆ వ్యక్తి నుండి ఎటువంటి స్పందన రాలేదు. అప్పుడు, అతను మరోమారు.. “హలో అంకుల్, కాసేపు నిలబడి, ఆ తర్వా కూర్చోండి” అని చెబుతాడు. దీనికి ఆ వ్యక్తి రియాక్షన్ ఇస్తూ.., ‘అతను ఎవరికి ఫోన్ చేస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు’ అని జవాబిచ్చాడు. ప్రయాణికుడు ఇంకా ఇలా అన్నాడు, “ఎవరు అంకుల్ ఇక్కడ కూర్చున్నారు?” అంటూ.. ఫన్నీగా, ఇబ్బందికరమైన రీతిలో ప్రశ్నించాడు.. ముక్కు సూటీగా ఆ వ్యక్తి, “ఇక్కడ మీకు అంకుల్ ఎవరయ్యా..అంటూ నిలదీశాడు.
X ఖాతా @mumbaimatterz ద్వారా వీడియో షేర్ చేయబడింది. వీడియో క్యాప్షన్ ఇలా ఉంది, “#ముంబైలోకల్‌లో ఎవరినీ అంకుల్ అని పిలవకండి.” అంటూ రాసి ఉంది.. వైరల్ వీడియోని ఇప్పటి వరకు 77 వేల కంటే ఎక్కువ మంది వీక్షించారు. భారీ సంఖ్యలో లైకులు కూడా వచ్చాయి. వీడియోపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ఒక వినియోగదారు “పర్ఫెక్ట్ సమాధానం” అంకుల్ ఎవరు ఉన్నారు అక్కడ ? అంటూ పేర్కొన్నారు. మరొక వినియోగదారు ఇలా వ్యాఖ్యానించారు, “మీరు ఎవరినీ అంకుల్/ఆంటీ అని పిలవకండి..ఇది వాళ్లకు అవమానం! కొంతమందికి ‘కామన్’ మర్యాదలు బోధించాల్సిన అవసరం ఉందంట వ్యాఖ్యనించారు.
అతని సమాధానం సరైనదే అంటూ మరో వ్యక్తి కామెంట్ చేశారు. అలాగే మనం కలర్ తక్కువగా ఉన్నామనో..బాల్ హెడ్ ఉందనో ఒకరినొకరు అంకుల్/ఆంటీ అని సంబోధించుకోవటం సరికాదన్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..