Viral: చేపల కోసం వేటకు వెళ్తే.. ఎదురుగా కనిపించింది చూడగా

|

Dec 12, 2024 | 1:00 PM

చేపలు పట్టుకునేందుకు నదిలో దిగాడు. తన దగ్గర ఉన్న బోట్‌తో బోటింగ్ చేస్తుండగా.. అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఇంతకీ అసలేం జరిగిందో ఈ వార్తలో చూసేయండి..

Viral: చేపల కోసం వేటకు వెళ్తే.. ఎదురుగా కనిపించింది చూడగా
Represenatative Image
Follow us on

సాధారణంగా మన దేశంలో జాలర్లు తప్పితే.. చేపల వేటకు వెళ్లేవారి సంఖ్య చాలా తక్కువ. కానీ విదేశాల్లో అలా కాదు.. వీకెండ్ దొరికితే చాలు.. స్థానికంగా ఉండే ఏదొక సరస్సు దగ్గరకు చేపలు పట్టుకునేందుకు వెళ్లిపోతుంటారు జనాలు. ఇక ఇదే కోవలో ఈ వ్యక్తి కూడా తన దగ్గర ఉన్న చిన్న బోటుతో ఓ చెరువులోకి దిగాడు. అలా నీటిలో కాసేపు బోటింగ్ చేసి.. చేపలు పడదామని అనుకున్నాడు. కట్ చేస్తే.. కొద్దిదూరానికే అతడికి ఎదురైన అనుభవంతో దెబ్బకు షాక్ అయ్యాడు. అసలు ఇంతకీ ఏమైందంటే..!

వైరల్ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి సరస్సులో తన దగ్గర ఉన్న బోట్‌తో బోటింగ్ చేస్తున్నాడు. ఇక ఓ భారీ పాము.. ఎక్కడుంచి వచ్చిందో తెలియదు.. అతడి బోటుపైకి చేరుకొని.. కాటు వేయడానికి సిద్దపడింది. సదరు వ్యక్తి దగ్గర బోటింగ్ స్టిక్ ఉండటంతో దాన్ని అడ్డుపెట్టుకుని.. ఆ కాటు నుంచి తప్పించుకున్నాడు. ఆ తర్వాత ఏమైందో తెలియదు గానీ.. ప్రస్తుతం ఈ క్లిప్ ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.

ఇక అందులో కనిపించిన పాము పేరు మాన్‌గ్రోవ్ స్నేక్(మడ పాము). మడ పాములు మన దేశంలో కనిపించడం చాలా అరుదు. ఎక్కువగా అండమాన్ నికోబార్ ఐలాండ్స్‌ కనిపించే ఈ పాములు.. సుమారు 3 ఫీట్ వరకు పెరుగుతాయి. అలాగే ఈ పాముల విషం చాలా బలహీనమైనది. కానీ కాటు ఎక్కువైతే.. అది మరింత విషపూరితంగా మారుతుంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి