ఇంట్లో పేలిన గ్యాస్‌ సిలిండర్‌ .. తృటిలో తపించుకున్న ఇద్దరు వ్యక్తులు..ఆ భయానక దృశ్యం ఎలా ఉందంటే..

ఇంట్లో ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్ లీక్ అయిన తర్వాత భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదం నుండి భార్యాభర్తలిద్దరూ సురక్షితంగా తప్పించుకున్నారు..ఇళ్లంతా ఎగిసి పడుతున్న మంటల్లోంచి వారివురు ఎలా బయటపడ్డారో చూపించే ఈ షాకింగ్‌ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోంది. అంత పెద్ద ప్రమాదం నుండి వారిద్దరు ఎలా బయటపడ్డారు అనుకుంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఇంట్లో పేలిన గ్యాస్‌ సిలిండర్‌ .. తృటిలో తపించుకున్న ఇద్దరు వ్యక్తులు..ఆ భయానక దృశ్యం ఎలా ఉందంటే..
Gas Cylinder Blast

Updated on: Jun 23, 2025 | 10:21 AM

ఎల్‌పిజి సిలిండర్ గ్యాస్ లీక్ కారణంగా ఇంట్లో మంటలు చెలరేగడంతో ఒక మహిళ, ఒక పురుషుడు తృటిలో తప్పించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ షాకింగ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ భయంతో వణికిపోతున్నారు. అంత పెద్ద ప్రమాదం నుండి వారిద్దరు ఎలా బయటపడ్డారు అనుకుంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గ్యాస్‌ లీకేజీ కారణంగా ఇళ్లంతా పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో వారు క్షణాల్లో ఇంటి నుండి బయటకు పరిగెత్తటం వీడియోలో స్పష్టంగా కనిపించింది.

వైరల్‌గా మారిన వీడియోకు సంబంధించిన సంఘటన ఎక్కడ జరిగిందో ఖచ్చితమైన ప్రదేశం తెలియదు. కానీ, CCTV ఫుటేజ్‌ ఆధారంగా జూన్ 18 బుధవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. వీడియోలో LPG సిలిండర్ పైపు లీక్ అవుతోంది. గ్యాస్‌ లీక్‌ అవుతున్న సిలిండర్‌, సహా పైప్‌ చేతిలో పట్టుకుని వంటింట్లోంచి బయటకు తీసుకువచ్చింది. గ్యాస్‌ లీకేజీని ఆపేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. కానీ, ఆ మహిళ భారీ లీకేజీని ఆపలేకపోయింది. అంతలోనే సిలిండర్ నేలపై పడిపోయింది. దాని నుండి మరింత జోరుగా గ్యాస్ లీక్ అవుతోంది. కొన్ని నిమిషాల తర్వాత ఆమెకు సాయంగా మరో వ్యక్తి సంఘటనా స్థలానికి వచ్చాడు. ఆ ఇంటికి ఒక ద్వారం గుండా ఆ మహిళ, వేరే తలుపు ద్వారా ఆ వ్యక్తి వచ్చారు. వారిద్దరూ సిలిండర్ దగ్గరికి చేరుకుని గ్యాస్ పైపు నాబ్‌ను మూసివేయడం ద్వారా గ్యాస్ లీకేజీని ఆపడానికి ప్రయత్నించడం ప్రారంభిస్తారు.

ఇవి కూడా చదవండి

ఈ క్రమంలోనే ఇళ్లంతా గ్యాస్ తో నిండిపోయింది. వారు నాబ్ ని మూసివేయడానికి ప్రయత్నిస్తుండగానే వంటగది లోపల భారీ పేలుడు సంభవించింది. ఉవ్వెత్తున మంటలు చెలరేగి ఇల్లంతా మంటలతో నిండిపోయింది. అదృష్టవశాత్తూ, గ్యాస్ లీకేజీ సమయంలో ఆ మహిళ ఇంటి తలుపులు, కిటికీలను తెరిచి ఉంచింది. దీని వలన పేలుడు ప్రభావం తగ్గింది. ఆ మహిళ, పురుషుడు ఇద్దరూ భారీ పేలుడు నుండి సురక్షితంగా బయటపడ్డారు.

వీడియోలో వంటగది లోపల ఉంచిన గ్యాస్ స్టవ్ నుండి మంటలు ప్రారంభమై, మంటలు వేగంగా ఇల్లు మొత్తం వ్యాపించినట్లు చూడవచ్చు. అయితే, పేలుడు ప్రభావం తక్కువగా ఉండటంతో ఆ ఇంట్లోని వారిద్దరూ ఎటువంటి గాయాలు లేకుండా ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

అన్ని తలుపులు, కిటికీలు తెరిచి ఉండటం వల్ల వారి అదృష్టం బాగుంది. ఇల్లంతా ఓపెన్‌గా ఉండటంతో చాలా గ్యాస్ బయటికి వెళ్లి పేలుడు ప్రభావాన్ని గణనీయంగా తగ్గించింది అని పేర్కొంటూ ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయబడింది. ప్రమాద సమయంలో ఆ మహిళ సమయస్పూర్తి, చాకచక్యంగా వ్యవహరించిన తీరుతో పెను ప్రమాదం తప్పింది. ఇంట్లో అంతపెద్ద పేలుడు జరిగినా ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు అంటూ చాలా మంది నెటిజన్లు వ్యాఖ్యానించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..