విషు బంపర్‌ విన్నర్‌ అతడే.. లాటరీలో రూ.10కోట్లు గెలుచుకున్నాడు..ఇప్పుడు ఎక్కడ..?

|

May 31, 2022 | 11:50 AM

అదృష్టం మనిషికి ఒక్కసారే వస్తుంది.. కానీ దరిద్రం అలా కాదు తలుపు తీసేంత వరకూ కొడుతూనే ఉంటుంది. అన్న మాట చాలా సందర్బాల్లో ఎవరో ఒకరు చెప్పే మాట...ఆ ఒక్క సారి వచ్చిన అదృష్టాన్ని తెలివిగా ఉపయోగించుకున్న వారే..

విషు బంపర్‌ విన్నర్‌ అతడే.. లాటరీలో రూ.10కోట్లు గెలుచుకున్నాడు..ఇప్పుడు ఎక్కడ..?
Vishu Bumper
Follow us on

అదృష్టం మనిషికి ఒక్కసారే వస్తుంది.. కానీ దరిద్రం అలా కాదు తలుపు తీసేంత వరకూ కొడుతూనే ఉంటుంది. అన్న మాట చాలా సందర్బాల్లో ఎవరో ఒకరు చెప్పే మాట…ఆ ఒక్క సారి వచ్చిన అదృష్టాన్ని తెలివిగా ఉపయోగించుకున్న వారే జీవితంలో ముందుకు వెళ్తారు. అలాంటి వాళ్లలో కొందరు లాటరీ టిక్కెట్లు కొనే అలవాటును కంటీన్యూ చేస్తుంటారు. ప్రతిరోజూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉంటారు..పదులు, వందలు, వేలు, లక్షలు కూడా వెచ్చించి లాటరీ టిక్కెట్లు కొంటుంటారు. అలాంటి వారు ఇటీవల కాలంలో చాలా మంది రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా మారిన వార్తలు చూస్తున్నాం. తాజాగా కన్యాకుమారికి చెందిన ఓ డాక్టర్‌కి బంపర్‌ ఆఫర్‌ తగిలింది. దాంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

అదృష్టవంతులంటే వీళ్లే.. వృత్తిరీత్యా డాక్టర్‌. కానీ, ఒకనాడు లాటరి టికెట్‌ కొన్నాడు. అదే ఇప్పుడు అతని దశను మార్చేసింది. కన్యాకుమారిలో డాక్టర్‌ ప్రదీప్‌ కుమార్‌..తిరువనంతపురంలో స్పెషల్ లాటరి ని కొనుగోలు చేశాడు. ఆ లాటరీతో అతని పంట పండింది. లాటరీలో పది కోట్ల రూపాయల ప్రైజ్‌ మనీ గెలుచుకున్నారు డాక్టర్‌ ప్రదీప్‌ కుమార్‌. కేరళలోని విషు ఫెస్టివల్‌ సందర్భంగా స్పెషల్‌ లాటరీని విడుదల చేశారు నిర్వాహకులు. కాగా, లాటరీలో ప్రైజ్‌ మనీ గెలుచుకున్న నెంబర్‌ డాక్టర్‌ ప్రదీప్‌దిగా గుర్తించారు. వెంటనే అతనికి సమాచారం అందించారు. త్వరలోనే డాక్టర్‌ ప్రదీప్‌ కుమార్‌ అకౌంట్‌కి మనీ డిపాజిట్‌ అవుతుందని లాటరీ కంపెనీ యాజమాన్యం వెల్లడించింది.