ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫాలోవర్లను పెంచుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు అందంగా డ్యాన్స్ చేయడం.. తమ అభిమాన సెలబ్రెటీల పాటలకు డ్యాన్స్ చేయడం.. డైలాగ్స్ చెప్పడం చేస్తుంటారు. ఇక మరికొందరు మాత్రం లైక్స్, వ్యూస్ కోసం ప్రాణాలకు తెగించి సాహాసాలు చేస్తుంటారు. ఇలాంటి వీడియోస్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని ఆశ్చర్యం కలిగించగా.. మరికొన్ని సూపర్ అనేలా ఉంటాయి. అలాగే అయ్యో పాపం ఇలా జరిగేందేంటీ అనిపించే వీడియోస్ కూడా చూసింటాం. తాజాగా అలాంటి వీడియోనే ఇప్పుడు ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది. రెప్పపాటులో ఊహించని ప్రమాదం బారిన పడ్డాడు ఓ యువకుడు. కాస్త అదృష్టం ఉండండంతో ప్రాణాలతోనూ బయటపడ్డాడు.
ఓ యువకుడు ఎత్తైన ప్రదేశంలో ఉన్న నిర్మానుష్యమైన రోడ్డు మీద సరదాగా స్కేటింగ్ చేయాలనుకున్నాడు. అలా ఆ యువకుడు స్కేటింగ్ చేస్తుండగా.. అతని వెనకాలే తన స్నేహితులు కార్లో వస్తూ వీడియో తీస్తున్నారు. అయితే ఎంతో స్పీడ్ గా స్కేటింగ్ చేస్తు వస్తున్న ఆ అబ్బాయి మలుపు వద్దకు రాగానే అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న రెయిలింగ్ లో పడిపోయాడు. తలకు ఉన్న హెల్మెట్ కారణంగా అతను నెలపై పడిపోకుండా రెయిలింగ్లో చిక్కుపోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ సో సాడ్… జాగ్రత్త అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.