సామాజిక మాధ్యమాల్లో (Social Media) నిత్యం ఎన్నో వీడియోలు పోస్ట్ అవుతుంటాయి. వీటిలో కొన్నింటిని చూశాక మన కళ్లను మనమే నమ్మలేం. అలాంటి వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి నీటి ఉపరితలంపై వేగంగా కదులుతూ చేపలు పట్టడాన్ని చూడవచ్చు. దీని వెనక రహస్యం ఏంటని నెటిజన్లు ఆలోచనలో పడ్డారు. ఈ వ్యక్తి దీన్ని ఎలా చేయగలిగాడని అయోమయానికి గురవతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో (Video) ప్రారంభంలో ఒక వ్యక్తి నీటి ఉపరితలంపై కూర్చున్నాడు. అంతే కాకుండా నీటిపై వేగంగా ముందుకు సాగిపోవడాన్ని చూడవచ్చు. అతని చేతిలో చేపలు పట్టేందుకు ఉపయోగించే వల ఉంది. అతను దానిని ఉపయోగించి చేపలను పట్టుకుంటున్నాడు. అయితే నీటిపై కూర్చొని గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా ముందుకు వెళ్తున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ వీడియో చూశాక నెటిజన్లు షాక్ అవుతున్నారు.
He’s so fast pic.twitter.com/0ovfTcj4hg
ఇవి కూడా చదవండి— Confusing Perspective (@ConfusedImage) August 15, 2022
గందరగోళంగా ఉన్న ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో కన్ఫ్యూజింగ్ పెర్స్‌పెక్టివ్ అనే ఖాతా ద్వారా పోస్ట్ అయింది. ‘ఇది ఎంత వేగంగా వెళుతుందో చూడండి’ అనే క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోను ఇప్పటివరకు 97 వేలకు పైగా వీక్షించగా, రెండున్నర వేల మందికి పైగా లైక్ చేశారు. ఈ సంఖ్య ఇంకా పెరుగుతోంది. ఈ వీడియో నెటిజన్లను బాగా కలవరపెడుతోంది. అంతే కాకుండా వీడియో చూసిన వారు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..