వైద్య రంగంలో అప్పుడప్పుడూ పలు సంచలన కేసులు నమోదవుతుండటం మనం చూస్తూనే ఉంటాం. పలు సమస్యలతో వచ్చే రోగులు.. చాలాసార్లు వైద్యులనే షాక్‌కు గురి చేసే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాగే చిత్ర విచిత్రమైన ఆపరేషన్లు జరిగిన ఘటనలు గురించి విన్నాం కూడా. సరిగ్గా ఇదే కోవకు చెందిన ఓ ఘటన తాజాగా ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తనకొచ్చిన విపరీతమైన కడుపు నొప్పికి ట్రీట్‌మెంట్ తీసుకోవడానికి ఆసుపత్రికి రాగా.. క్షణాల్లో అక్కడే వాంతి చేసుకున్నాడు. కట్ చేస్తే.. అతడికి షాక్ తగిలేలా ఏం బయటపడిందో చూస్తే.. మీరూ కంగుతింటారు.
వైరల్ వీడియో ప్రకారం.. ఉదయాన్నే ఓ వ్యక్తికి కడుపునొప్పి వచ్చింది. ఆ నొప్పి తీవ్రం కావడంతో హుటాహుటిన ఆసుపత్రికి పరుగులుపెట్టాడు. తీరా అక్కడికి వెళ్లగానే.. అతడు వాంతి చేసుకున్నాడు. కట్ చేస్తే.. కడుపు నుంచి ప్రాణాలతో బ్రతికున్న పొడవాటి నులిపురుగు బయటకు రావడంతో.. అతడితో సహా వైద్యులు కూడా దెబ్బకు షాక్ అయ్యారు. ఇక ఇది జరిగిన ముందు రోజు సదరు వ్యక్తి.. డాక్టర్లు రాసిచ్చిన నులిపురుగుల మందు తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా, నులిపురుగులు బయటకు వచ్చేయడంతో.. అతడి ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు చెప్పారు. అతడు చాలాకాలం తర్వాత నులిపురుగుల మందు తీసుకోవడంతో ఇలా జరిగిందని అన్నారు. ఇక అటు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు భిన్నాభిప్రాయాలతో కామెంట్స్ చేస్తున్నారు. లేట్ ఎందుకు మీరూ వీడియోపై లుక్కేయండి.
Yesterday,a patient walked into the pharmacy with complaints of abdominal pain and an urge to vomit 🤮. The pharmacist asked him when last he dewormed himself and said it’s been years . He was prescribed vermox to use . He took the medication last night and woke up this morning… pic.twitter.com/Ovkt2hjbqU
— Pharmacist Emeka (@StarBede) April 2, 2024