ఇంటర్నెట్ వినియోగం పెరిగినప్పటి నుంచి ఎంతోమంది వ్యక్తులలో దాగి ఉన్న ప్రతిభ.. కొత్త కొత్త ఇన్వెన్షన్ల రూపంలో బయటపడుతోంది. తమకు అందుబాటులో దొరికే చిన్న చిన్న వస్తువులతోనే ఇంజనీర్లు సైతం ఆశ్చర్యపోయేలా సరికొత్త వెహికిల్స్‌ను సిద్దం చేస్తున్నారు. ఈ కోవలోనే ఓ వ్యక్తి చేసిన వాహనం ప్రస్తుతం నెటిజన్లను ఫిదా చేస్తోంది. అసలు ఆ వ్యక్తి ఈ బండిని ఎలా చేశాడో తెలియదు గానీ.. అతడి తెలివికి మాత్రం అందరూ సాహో అంటున్నారు.
వైరల్ వీడియో ప్రకారం.. ఎఫ్ 1 రేస్‌లో ఉపయోగించే కారు లాంటి వెహికిల్‌లో ఓ వ్యక్తి నల్ల జాకెట్, హెల్మెట్ పెట్టుకుని పాలను సరఫరా చేస్తున్నట్లు మీరు చూడవచ్చు. అతగాడు ఎఫ్ 1 కారు రేసర్ అవ్వాలనుకున్నాడో.. లేక తనలోని ప్రతిభను వెలికి తీయాలనుకున్నాడో తెలియదు గానీ.. ఆ వాహనాన్ని చూసి ఇంజనీర్లు అసూయ పడేలా చేశాడు. తన దగ్గర ఉండే వస్తువులతో అతడి తెలివికి పదునుపెట్టి సరికొత్త ఇన్వెన్షన్‌ను ప్రపంచానికి పరిచయం చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కాగా, ఈ ఫన్నీ వీడియోను RoadsOfMumbai అనే ట్విట్టర్ పేజీ సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేసింది. ‘మీరు ఫార్ములా వన్ డ్రైవర్ కావాలనుకున్నప్పుడు.. కుటుంబం ఒత్తిడితో పాల వ్యాపారంలో సహాయపడితే’ అని క్యాప్షన్ ఇచ్చింది. ఇప్పటిదాకా ఈ వీడియోకు లక్షా 30 వేలకు పైగా వ్యూస్ రాగా.. 3 వేల వరకు లైకులు వచ్చాయి. లేట్ ఎందుకు మీరూ ఓసారి వీడియోపై లుక్కేయండి..
When you want to become a F1 driver, but the family insists in helping the dairy business ?? pic.twitter.com/7xVQRvGKVb
— Roads of Mumbai ?? (@RoadsOfMumbai) April 28, 2022
Where there’s a will there’s a way!!!kudos to this guy ???
— Revathi Krishnan (@revathishyamk) April 28, 2022
This is really cool!
— Pranam_Pitaji (@pranam_pitaji) April 28, 2022
No doubt he is talented.
— R R S (@ACommon61990278) April 28, 2022