Viral Video: ఇదేందిది.! కిట్‌క్యాట్ చాక్లెట్‏తో టమోటా కట్ చేశాడు.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే

|

Dec 24, 2021 | 1:11 PM

సోషల్ మీడియాలో ట్రెండింగ్ వీడియోలు కోకొల్లలు. కొన్ని క్యూట్‌గా అనిపిస్తే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అసలు ఇది ఎలా జరిగింది.?

Viral Video: ఇదేందిది.! కిట్‌క్యాట్ చాక్లెట్‏తో టమోటా కట్ చేశాడు.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే
Kitkat
Follow us on

సోషల్ మీడియాలో ట్రెండింగ్ వీడియోలు కోకొల్లలు. కొన్ని క్యూట్‌గా అనిపిస్తే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అసలు ఇది ఎలా జరిగింది.? ఇలా కూడా జరుగుతుందా అనిపించేలా వీడియోలు కొన్ని నెట్టింట హల్చల్ చేస్తుంటాయి. అలాంటి ఓ వీడియో గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇక్కడొక వ్యక్తి కిట్‌క్యాట్ చాక్లెట్‌తో టమోటాను రెండు ముక్కలుగా కట్ చేశాడు. ఇది చూసిన తర్వాత నెటిజన్లు ఒకింత షాక్‌కు గురవుతున్నారు.

వైరల్ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి కత్తిని నూరినట్లుగా కిట్‌క్యాట్ చాక్లెట్ అంచుకు పదును పెట్టి మరీ టమోటాను రెండు ముక్కలుగా కోశాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, ఈ వీడియోను ‘whathowwhystudio’ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయగా.. ఇప్పటిదాకా 1.2 లక్షలకు పైగా వ్యూస్ సంపాదించింది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి ఫన్నీ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.