Viral Video: మొబైల్ కాఫీ షాప్ చూశారా? ఆవిరి పట్టడానికి అంకుల్ ఐడియా సూపర్బ్..

|

Nov 10, 2023 | 1:24 PM

వైరల్ అవుతున్న వీడియోలో ఒక వృద్ధుడు సైకిల్‌పై  కాఫీ తయారీ చేస్తున్న సెటప్‌ని రెడీ చేసుకున్నాడు. దీనిసాయంతో కాఫీని తయారీ చేసి విక్రయిస్తున్నాడు. వృద్ధుడు కాఫీని ఆవిరి జోడించి వేడి చేయడానికి ఒక ఉపాయాన్ని ఆశ్రయించాడు. ఆ వృద్ధుడి తెలివైన పనికి వావ్ అనకమానరు ఎవరైనా.  వీడియో చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు.

Viral Video: మొబైల్ కాఫీ షాప్ చూశారా? ఆవిరి పట్టడానికి అంకుల్ ఐడియా సూపర్బ్..
Viral Video
Follow us on

జుగాద్ విషయంలో భారతీయులమైన మనకు పోటీ లేదు. పనికిరాని వస్తువులకు ప్రాణం పోసి వాటిని ఉపయోగపడేలా చేయడంలో మన టెక్నాలజీ అద్భుతం. ఇలాంటి వస్తువులను చూసి సామాన్యుడే కాదు పెద్ద పెద్ద ఇంజనీర్లు కూడా విస్తుపోతున్నారు. ఇంటర్నెట్‌లో ఎప్పుడు వీడియో వచ్చినా చూడటమే కాకుండా విపరీతంగా షేర్ చేయడానికి కూడా ఇదే కారణం. ఈ నేపథ్యంలో తాజాగా ఒక షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది.

ఆహారం, పానీయాల గురించి అనేక రకాల ప్రయోగాలు జరుగుతున్నాయి.  తాజాగా కాఫీ తయారు చేస్తున్న ఒక వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

ఇక్కడ వీడియో చూడండి


వైరల్ అవుతున్న వీడియోలో ఒక వృద్ధుడు సైకిల్‌పై  కాఫీ తయారీ చేస్తున్న సెటప్‌ని రెడీ చేసుకున్నాడు. దీనిసాయంతో కాఫీని తయారీ చేసి విక్రయిస్తున్నాడు. వృద్ధుడు కాఫీని ఆవిరి జోడించి వేడి చేయడానికి ఒక ఉపాయాన్ని ఆశ్రయించాడు. ఆ వృద్ధుడి తెలివైన పనికి వావ్ అనకమానరు ఎవరైనా.  వీడియో చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వాస్తవానికి కాఫీని ఆవిరితో వేడి చేయడానికి కుక్కర్ సహాయం తీసుకున్నాడు. కుక్కర్ నుంచి వెలువడే ఆవిరితో కాఫీని తయారు చేస్తున్నాడు.

కాఫీని ఆవిరి చేసే పద్ధతి అద్భుతమైనది. అయితే ఈ వీడియో చూసినంత మాత్రాన ప్రతి ఒక్కరూ దీనిని ప్రయత్నించలేరు. ఈ క్లిప్ @thegreatindianfoodie పేరుతో Instagramలో షేర్ చేశారు. ఈ వీడియోను  మిలియన్ల మంది చూశారు. వృద్ధుడి తెలివి తేటలను..  జుగాడ్‌ను ప్రశంసిస్తున్నారు. ఒకరు సోదరా ఈ జుగాడ్ భారతదేశం దాటి వెలుపలికి వెళ్లకూడదు’ అని చెప్పాడు. మరోకరు దేశీ జుగాద్ జిందాబాద్ అని రాశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..