Viral Video: ఏం ఐడియా రా బాబు! రైలు జనరల్ కోచ్‌లో కనీసం నిల్చునేందుకు చోటులేక ఇలా..

| Edited By: Janardhan Veluru

Sep 28, 2024 | 2:51 PM

జనరల్ బోగిలో అడుగుతీసి అడుగు వేసే పరిస్థితి కూడా ఉండదు. ఇలాంటి పరిస్థతిలో కొందరు చేసే పనులు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తాయి. అదే విధంగా ఓ రైలులో ఓ వ్యక్తి చేసిన పనికి అందరూ మెచ్చుకుంటున్నారు.

Viral Video: ఏం ఐడియా రా బాబు! రైలు జనరల్ కోచ్‌లో కనీసం నిల్చునేందుకు చోటులేక ఇలా..
Sleeping In Train
Follow us on

మన దేశంలో రైళ్లలో ప్రయాణించడం అంతా ఈజీ కాదు భయ్యా.. మరీ ముఖ్యంగా జనరల్ బోగీలో ప్రయాణించడం కత్తి మీద సామే అని చెప్పాలి. అందులో ప్రయాణించాలంటే గుండె ధైర్యమే కాదు.. పరిస్థతులను మనకు అనుగుణంగా మార్చుకోవాలి. భారతదేశం బుల్లెట్ రైళ్ల వైపుగా దూసుకుపోతుంటే, రోజుకో వందేభారత్‌ రైలును కేంద్రం ప్రారంభించినా ఎక్స్‌ప్రెస్ రైళ్లలోని జనరల్ బోగీలకు మాత్రం మహర్దశ రావడం లేదు. ఇసుకేస్తే రాలనంత జనం ఉంటున్నారు. నిలబడే స్థలం కూడా ఉండడం లేదు. కొందరు అయితే నడిచే స్థలంలో అడ్డంగా కూర్చుంటారు. పొరపాటున వాష్ ర్రూమ్‌కి వెళ్లాలంటే వారిని దాటుకొని పోవడం పెద్ద టాస్క్‌యే అని చెప్పాలి. వాష్ రూమ్స్ గూర్చి ప్రత్చేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

జనరల్ బోగిలో అడుగుతీసి అడుగు వేసే పరిస్థితి కూడా ఉండదు. ఇలాంటి పరిస్థతిలో కొందరు చేసే పనులు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తాయి. అదే విధంగా ఓ రైలులో ఓ వ్యక్తి చేసిన పనికి అందరూ మెచ్చుకుంటున్నారు. జనరల్ బోగీలో ట్రావెల్ చేస్తే ఓ వ్యక్తి పైన ఉండే రెండు బెర్తల్‌కు దుప్పటిని కట్టి ఉయ్యాల్లా ఏర్పాటు చేసుకొని అందులో హాయిగా సేద తీరాడు. అతని పక్కన ఉన్నవారు కొందరు కింద కూర్చుంటే మరికొందరు నిలబడి ఉన్నారు. ఈ యువకుడు తెలివిని చూసి అందరూ ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను అందరూ షేర్ చేయడంతో 15 లక్షల ఫ్యూస్ వచ్చాయి. ఈ వీడియోపై అందరూ రకరకలుగా స్పందిస్తున్నారు. కొందరూ ఐడియా అదుర్స్ అంటూ ఆ యువకుడిని ఆకాశానికి ఎత్తివేస్తుంటే.. మరికొందరు ట్రోల్ చేస్తున్నారు.

వీడియో చూడండి


ఇండియాలో ఇలాంటి టాలెంట్‌కు కొదవలేదని, జపాన్, చైనా వాళ్లు ఏదో కనిపెడుతుంటే మన ఇండియా వాళ్లు ఇలాంటివి కనిపెడుతున్నారని కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దుప్పటి మంచిగా కట్టుకో బ్రో.. లేకపోతే కింద పడితే ఆసుపత్రి బెడ్ మీద పడుకోవాల్సి వస్తుందని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. ఈ వీడియోపై మీమ్స్ కూడా వస్తున్నాయి. లాఫింగ్ ఎమోజీ పెట్టి వీడియోను వైరల్ చేస్తున్నారు. కొందరు ఆ యువకుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే ఇలా చేశాడాని అంటుంటే మరికొందరు ఏదైతే ఏంటి ఆలోచన బాగుంది అని కామెంట్స్ చేస్తున్నారు.