
ఉత్తరప్రదేశ్‌లోని మౌ జిల్లా, భిటి తహసీల్ ప్రాంతానికి చెందిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో, ఒక యువకుడు రెండు ఎయిర్ కండిషనర్ల చల్లని గాలికి ఎస్‌బిఐ ఏటిఎమ్‌లో ప్రశాంతంగా నిద్రపోతూ కనిపిస్తాడు. అతను ఎంత గాఢ నిద్రలో ఉన్నాడంటే, పారదర్శకమైన గాజు తలుపు ఉన్నప్పటికీ, తెల్లవారిన విషయాన్ని కూడా గమనించలేదు. శుక్రవారం ఉదయం ఏటిఎమ్ నుండి డబ్బులు విత్‌డ్రా చేయడంలో ఇబ్బంది పడిన కొందరు వ్యక్తులు ఈ వీడియోను రికార్డ్ చేసి వైరల్ చేశారు. దీనిపై రకరకాల కామెంట్లు వస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్‌లోని మౌ జిల్లాలో ఒక ఆసక్తికరమైన సంఘటన వెలుగుచూసింది. రాత్రి పూట ఇంట్లో ఉక్కపోతను భరించలేకపోయిన ఒక వ్యక్తి.. ఏకంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఏటీఎం సెంటర్‌ను తన బెడ్‌రూమ్‌గా మార్చేసుకున్నాడు. ఏటీఎం క్యాబిన్‌లో ఏసీ ఫుల్లుగా వస్తుండటంతో, హాయిగా అక్కడే బెడ్‌షీట్ పరుచుకుని రాత్రంతా నిద్రపోయాడు. ఆ మరుసటి రోజు ఉదయం ఏటీఎంలో డబ్బులు డ్రా చేయడానికి వచ్చిన కొందరు కస్టమర్లు లోపల వ్యక్తి పడుకుని ఉండటం చూసి అవాక్కయ్యారు. క్యాబిన్ లోపల ఎంచక్కా నిద్రపోతున్న సదరు వ్యక్తిని కొందరు తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ప్రత్యక్షం కావడంతో క్షణాల్లో వైరల్‌గా మారింది.
ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. భారతీయుల జుగాడ్ ఆలోచనలకు ఆకాశమే హద్దు అని కొందరు కామెంట్ చేస్తుంటే, రాత్రి వేళల్లో ఏసీ బిల్లులు కట్టలేని సామాన్యుడి కష్టానికి ఇది నిదర్శనం అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఈ కూల్ ఐడియా ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..