కుక్క, పిల్లి, ఆవు, గేదె, గొర్రె, మేక.. ఇలా పెంపుడు జంతువులు ఎన్నో మనుషులతో కలిసిమెలిసి ఉంటే.. మరోవైపు క్రూర జంతువులు పులి, చిరుత, చీతా, సింహం లాంటివి అడవిలో వేటాడుతూ తమ జీవనాన్ని కొనసాగిస్తున్నాయి. ఇండియాలో అయితే.. క్రూర జంతువులను పెంపుడు జంతువులుగా పెంచుకోవడం నిషేధం.. కానీ విదేశాల్లో అలా కాదు.. కింగ్ కోబ్రాలు, అనకొండలు, చీతా, సింహం, పులి.. ఇలా దేనినైనా కూడా పెంపుడు జంతువుగా పెంచుతారు. మరి క్రూర మృగాలను పెంపుడు కుక్కల్లా పెంచుకుంటే.. ఎలాంటి ప్రమాదాలు వస్తాయో.. చెప్పే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వైరల్ వీడియో ప్రకారం.. ఓ ఇద్దరు వ్యక్తులు సోఫాలో కూర్చుని ఉండగా.. వారి మధ్య ఓ చీతాను మెడలో తాడుకట్టి కుక్కలాగ కూర్చోబెట్టారు. వారిద్దరిలోని ఒక వ్యక్తి ఆ చీతా తలను నిమిరే ప్రయత్నం చేశాడు. తనకు ఆ వ్యక్తి ఏదో అపాయం తలపెట్టేలా ఉన్నాడని అనుకుని.. ఆ చీతా తన పంజాతో అతడి చెంపపై గట్టిగా కొట్టింది. ఆ దెబ్బకు అతడి దిమ్మతిరిగింది. వెంటనే అక్కడి నుంచి లేచి దూరంగా వెళ్లిపోయాడు. ఆ తర్వాత అతడ్ని చీతా ఎక్కడ కొట్టిందో.. మిగిలినవారికి చూపించాడు. కాగా, ఈ వీడియోను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. క్షణాల్లో అది కాస్తా వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తించారు. ఆ ఇద్దరు వ్యక్తులను జనాలు తిట్టిపోస్తున్నారు. క్రూర జంతువులను ఇంట్లో పెంపుడు జంతువుల మాదిరి పెంచితే.. ఏదోక రోజు చావు తప్పదని హెచ్చరించారు. లేట్ ఎందుకు మీరూ వీడియోపై ఓ లుక్కేయండి.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..