ఇంగ్లాండ్‌లో ఓ 67 ఏళ్ల వృద్ధుడు బ్యాంక్ చోరీకి ప్రయత్నించి చివరికి అరెస్టయ్యాడు. అతను మూడు బ్యాంక్‌లకు వెళ్ళాడని పోలీసులు తమ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేయగా అది కాస్తా వైరల్‌గా మారింది. స్లాటరీ అనే ముసలాయన మొదట ఓ బ్యాంకులోకి ప్రవేశించాడు. నేరుగా క్యాషియర్ దగ్గరకు వెళ్లి అతడి చేతిలో ఓ బెదిరింపు చీటీ పెట్టాడు. చీటీలో చేతిరాత అర్థం కాక క్యాషియర్ దాన్ని పక్కన పెట్టేసి తన పనిలో మునిగిపోయాడు. ఆ క్యాషియర్ వైపు ఓ సారి ఎగాదిగా చూసి అక్కడినుంచి వెళ్లిపోయాడు వృద్ధుడు. కొద్దిసేపటి తర్వాత చీటి చదివిన ఆ సిబ్బంది ఆ ముసలాయన ఏం రాశాడో అర్థమై ఒక్కసారిగా షాక్ తిన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్లాటరీ ఈ సారి అదే బ్యాంకుకు చెందిన మరో బ్రాంచ్‌కి వెళ్లాడు. క్యాషియర్ దగ్గరకు వెళ్లి మునుపటి లాగే ఓ చీటీ అతడి చేతిలో పెట్టాడు. అది చదివిన క్యాషియర్ భయపడిపోయాడు. వెంటనే 2,400 స్టెర్లింగ్ పౌండ్‌లు అంటే దాదాపు రెండున్నర లక్షలు అతడి చేతిలో పెట్టాడు. ముసలాయన డబ్బుతో బ్యాంకు బయటకు వచ్చాడు. కొన్ని గంటల తర్వాత నాట్‌వెస్ట్‌లోని మరో బ్యాంకుకు వెళ్లాడు. అక్కడ కూడా ఓ చీటీని క్యాషియర్ చేతిలో పెట్టాడు. చీటీని చదివిన సదరు క్యాషియర్ స్లాటరీపై సీరియస్ అవ్వటంతో చేసేదేమీ లేక అక్కడినుంచి బయటకు వచ్చేశాడు.
ఈ మూడు బ్యాంకుల సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయిన స్లాటరీ ఫుటేజీలను పోలీసులు సేకరించారు. స్టాటరీని అతడి ఇంటివద్ద అరెస్ట్ చేశారు. తాజాగా ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు అతడికి ఆరు సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
Also Read:ఆ విగ్రహం ఇంట ఉంటే దరిద్రం వదులుతుంది, సిరుల పంటే అంటారు.. కొంటే సీన్ సితారే