Viral Video: పాపం! హీరోయిజం చూపించాలనుకున్నాడు.. కుక్క గట్టిగానే బుద్ది చెప్పిందిగా..

|

Aug 23, 2022 | 8:20 PM

'ఏదైతే నువ్వు ఇస్తావో.. అదే నీకు తిరిగొస్తుంది' అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. దీనినే కర్మ సిద్దాంతం అని అంటారు.

Viral Video: పాపం! హీరోయిజం చూపించాలనుకున్నాడు.. కుక్క గట్టిగానే బుద్ది చెప్పిందిగా..
Dog
Follow us on

‘ఏదైతే నువ్వు ఇస్తావో.. అదే నీకు తిరిగొస్తుంది’ అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. దీనినే కర్మ సిద్దాంతం అని అంటారు. తప్పు చేసినవాడు.. కచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈ కోవకు చెందిన వీడియోలు మనం సామాజిక మాధ్యమాల్లో చాలానే చూసి ఉంటాం. తాజాగా ఆ కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది. ఇందులో ఓ వ్యక్తి హీరోయిజం చూపేందుకు సైలెంట్‌గా రోడ్డు పక్కన వెళ్తున్న ఓ కుక్కను రాయితో కొట్టాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

వైరల్ వీడియో ప్రకారం.. రోడ్డు పక్కన ఓ కుక్క తన మానాన్నా తాను వెళ్తుండగా.. హీరోయిజం చూపిస్తే.. ఇవతల వైపు ఉన్న వ్యక్తి దాన్ని రాయితో కొట్టాడు. అంతే! దెబ్బకు క్షణాల్లో అతడి కర్మఫలం రిటర్న్ వస్తుంది. ఆ కుక్క అతడిపైకి దాడి చేసింది. ఆ వ్యక్తికి ఓ గుణపాఠం నేర్పించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. అంతేకాదు అతడి చేసిన చెత్త పనికి తిట్టిపోస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..