
సోషల్ మీడియాలో నిత్యం వందల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.. ఇందులో కొన్ని వీడియోలు చూస్తే నవ్వాగదు. మరికొన్ని వీడియోలు చూస్తే భయంతో వణికిపోతాం.. ఈ వీడియో మాత్రం మనల్ని షాక్‌కి గురిచేస్తుంది. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఈ వీడియో చూస్తే నిజంగా వణుకుపుడుతుంది. మాములుగా పామును చూస్తే ఆమడ దూరం పారిపోతాం. కానీ ఓ యువకుడు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
వైరల్ అవుతోన్న ఈ వీడియోలో ఓ యువకుడు నది ఒడ్డున చేతిలో చేప పట్టుకుని నిల్చున్నాడు. తన చేతిలోని చేపలను చూపిస్తూ నదీప్రాణులను ఆకర్షించేందుకు ప్రయత్నించడం మనకు కనిపిస్తుంది. ఇంతలో ఊహించని షాకింగ్ విషయం చోటు చేసుకుంది. ఈ వైరల్ వీడియోలో, చేతిలో చిన్న చేపతో నది ఒడ్డున ఓ వ్యక్తి నిలబడి ఉన్నాడు. ఈ చేపను చూపించి నదిలోని ఇతర ప్రాణులను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. తన చేతిలోని చేపను చూసి వేరే చేప లేదా అలాంటి జీవి తన వద్దకు వస్తాయనే ఆశతో అతను ఇలా చేసాడు. కానీ అతని చేతిలో ఉన్న చేపను చూసి వచ్చిన దాన్ని చూసి అతడు అవాక్ అయ్యాడు.
ఆ చేప ను చూసి నదిలో నుంచి ఓ భారీ పాము బయటకు వచ్చింది. వచ్చిన ఆ పాము హాని చేయకుండా ఆ వ్యక్తి చేతిలో నుండి చేపను నోటితో పట్టుకొని తిరిగి నీటిలోకి వెళ్లడాన్ని మనం చూడొచ్చు. ఆ వీడియోను thenextcatch అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా షేర్ చేయబడింది. ఈ వీడియోకి ఇప్పటివరకు 571కే వ్యూస్ వచ్చాయి. 11.7కే లైక్‌లు వచ్చాయి. చాలా కామెంట్స్ వచ్చాయి.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..