మద్యం మత్తులో నెయిల్‌ కట్టర్‌ మింగేసిన తాగుబోతు.. 8 ఏళ్ల తర్వాత సర్జరీ చేసిన వైద్యులు..

|

Aug 20, 2023 | 9:14 PM

గతంలో హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో అరుదైన ఆపరేషన్ చేశారు వైద్యులు. 240 కిలోల బరువున్న ఓ వ్యక్తికి బెరీయార్ట్రిక్ సర్జరీ చేసిన డాక్టర్లు అతని బరువు 70 కిలోలు తగ్గించారు. ఆ తరువాత అతడు మరో 80 నుంచి 90 కిలోలు తగ్గే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. గ్యాస్ట్రిక్ బైపాస్ ద్వారా పొట్ట పరిమాణం తగ్గించడంతోపాటు, ఆ తర్వాత ఆహారం ఎక్కువగా పట్టకుండా చిన్న పేగును కూడా కాస్త తగ్గించినట్టుగా వైద్యులు వెల్లడించారు.

మద్యం మత్తులో నెయిల్‌ కట్టర్‌ మింగేసిన తాగుబోతు.. 8 ఏళ్ల తర్వాత సర్జరీ చేసిన వైద్యులు..
Man Swallows Nail Cutter
Follow us on

మద్యం మత్తులో ఏవేవో జరుగుతుంటాయి. మద్యం మత్తులో చాలా మంది నానా హంగామా చేస్తుంటారు. తాగిన మందు తలకెక్కితే ఏం చేస్తున్నామనే విషయం కూడా మర్చిపోయి ప్రవర్తిస్తుంటారు మందుబాబులు..ఈ క్రమంలో కొందరు ప్రమాదాల బారినపడుతుంటారు. ఎంతటి వారికైనా గ్లాసు మందు లోపల పడిందంటే చాలు ఒళ్లు తెలియక కష్టాలు కొనితెచ్చుకుంటారు. అలాంటిదే ఈ ఘటన కూడా. మద్యం మత్తులో నెయిల్ కట్టర్ మింగిన ఓ వ్యక్తికి ఎనిమిదేళ్ల తర్వాత సర్జరీ చేసి బయటకు తీశారు. మణిపాల్‌ ఆస్పత్రిలో శస్త్ర చికిత్స తర్వాత ఆ వ్యక్తి కడుపులో నుంచి నెయిల్‌ కట్టర్‌ తొలగించారు వైద్యులు. శుక్రవారం ల్యాప్రోస్కోపీ సర్జరీ చేశారు. ఎనిమిదేళ్ల క్రితం 40 ఏళ్ల వ్యక్తి మద్యం మత్తులో నెయిల్ కట్టర్ మింగేశాడు. ఇంతకాలం ఎలాంటి ఇబ్బంది లేకుండా మామూలుగానే ఉన్నాడు. కానీ, ఇటీవల అతడు కడుపునొప్పితో ఇబ్బందిపడ్డాడు. కడుపు నొప్పి భరించలేక ఆస్పత్రిలో చేరాడు. సర్జాపూర్‌లోని ఓ క్లినిక్‌కి వెళ్లి చూపించుకోగా.. అన్ని టెస్టులు చేసిన వైద్యులు..అతని కడుపులో లోహపు వస్తువు ఉన్నట్లుగా గుర్తించారు. దీంతో యువకుడిని మణిపాల్ ఆస్పత్రికి రెఫర్ చేశారు. అక్కడ పొట్ట స్కాన్ చేసిన వైద్యులు కడుపులో నెయిల్ కట్టర్ ఉన్నట్టుగా గుర్తించారు.

ఇలాంటి మరొక సంఘటనలో ఇంట్రా-అబ్డామినల్ ట్యూమర్‌ను తొలగించడానికి కీహోల్ సర్జరీ చేసిన వైద్యులు..సర్జికల్ క్లిప్ వదిలేశారు. త్రిసూర్ దయా ఆసుపత్రిలో జరిగిన ఈ శస్త్రచికిత్సపై బాధిత బంధువులు ఫిర్యాదు చేశారు. 14ఏళ్ల చిన్నారి కడుపులో సర్జికల్‌ క్లిప్‌ రియాక్షన్‌ కావటంతో చిన్నారిని ఎర్నాకులంలోని అమృతా ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం మరో ఆపరేషన్ చేసిన క్లిప్‌ని తొలగించారు. అస్వస్థతకు గురైన చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గతంలో ఉత్తరప్రదేశ్‌లో ఏడు నెలల బాలుడి శరీరం నుంచి రెండు కిలోల బరువున్న పిండాన్ని తొలగించారు. కడుపునొప్పితో చికిత్స పొందుతున్న ఓ చిన్నారి కడుపులో పిండం పెరుగుతూ కనిపించింది. అనంతరం శస్త్రచికిత్స చేసి పిండాన్ని బయటకు తీశారు.

ఇవి కూడా చదవండి

గతంలో హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో అరుదైన ఆపరేషన్ చేశారు వైద్యులు. 240 కిలోల బరువున్న ఓ వ్యక్తికి బెరీయార్ట్రిక్ సర్జరీ చేసిన డాక్టర్లు అతని బరువు 70 కిలోలు తగ్గించారు. ఆ తరువాత అతడు మరో 80 నుంచి 90 కిలోలు తగ్గే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. గ్యాస్ట్రిక్ బైపాస్ ద్వారా పొట్ట పరిమాణం తగ్గించడంతోపాటు, ఆ తర్వాత ఆహారం ఎక్కువగా పట్టకుండా చిన్న పేగును కూడా కాస్త తగ్గించినట్టుగా వైద్యులు వెల్లడించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..