మందు బాబులకు లిక్కర్ మహా అమృతం. ఆఖరి చుక్కను కూడా వదలకుండా.. కష్టపడి దాన్ని బయటకు తీసి లక్కీ డ్రాప్ అని తాగుతూ ఉంటారు. ఎప్పుడైనా కొంచెం లిక్కర్ కిందపోతే.. అదేదో ప్రాణం పోయినట్లు ఊసురుమంటారు. ఇక అక్రమ మద్యాన్ని పోలీసులు ధ్వంసం చేస్తోన్న సమయంలో వారి మనసు కకావికలం అవుతుంది. ఇటీవల ఏపీలోని గుంటూరులో.. మద్యం బాటిళ్లను వాహనంతో తొక్కిస్తున్న క్రమంలో.. మందుబాబులు హడావిడిగా వచ్చి ఆ బాటిల్స్ ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు. దాంతో అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆ వీడియో వైరల్ అయింది. తాజాగా అలాంటిదే మరో వీడియో వైరల్ అవుతోంది. అయితే ఇది ఏ ప్రాంతానికి సంబంధించినదో వివరాలు తెలియరాలేదు. మద్యం ధ్వంసం చేయడం చూసిన ఓ తాగుబోతు ఆగలేక., నేలపై పారుతున్న లిక్కర్ తాగేందుకు యత్నించాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
बस जीवन में इतना डेडीकेशन होना चाहिए
आपका लक्ष्य आप से बच के नही जा सकता 😂 pic.twitter.com/GUfOx2BBex— Reetesh Pal (@PalsSkit) September 18, 2024
వైరల్ వీడియోలో, మద్యం ధ్వంసం చేసిన తర్వాత, నేలపై చిందిన లిక్కర్‌ను ఒక తాగుతోతు తాగేందుకు ప్రయత్నం చేయడం చూడవచ్చు. పట్టుబడిన మద్యాన్ని పోలీసులు వరుసగా అమర్చి డోజర్ సాయంతో మద్యం బాటిళ్లను ధ్వంసం చేస్తుండగా.. అక్కడకు వచ్చిన ఓ తాగుబోతు పెద్దమనిషి కింద కూర్చుని.. నలకలు, మట్టి రాకుండా..తన దగ్గర ఉన్న వస్త్రం సాయంతో సిప్ చేశాడు. అతడిని గమనించిన ఓ పోలీస్.. వెంటకే అక్కడికి వచ్చి అతడిని గదమాయించి తరిమేశాడు. సెప్టెంబర్ 18న షేర్ చేయబడిన ఈ వీడియోకు 5 లక్షలకు పైగా వ్యూస్, బోలెడన్ని కామెంట్స్ పెడుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..