వామ్మో ! ఇదేం పిచ్చిరా సామీ.. ఐస్‌ బాక్స్‌లో మూడు గంటల పాటు నిల్చున్నాడు.. ఎందుకో తెలిస్తే..

|

Jan 07, 2024 | 4:32 PM

వైరల్‌ వీడియోలో ఒక వ్యక్తి ఐస్ బాక్స్‌లో ఎక్కువ సేపు నిలబడి రికార్డు సృష్టించాలనుకుంటున్నాడు. అందుకోసం ముందుగా ఒకపెద్ద  నిలువెత్తు గ్లాస్ బాక్స్ ను తీసుకువచ్చారు, అందులో వ్యక్తి నిలబడి ఉండగా, అతని మెడ వరకు ఐస్ క్యూబ్స్ వేశారు. ఈ వ్యక్తి మూడు గంటలపాటు అందులోనే అలాగే నిల్చున్నాడు. ప్రస్తుతం అతడు చేసిన స్టంట్ కు సంబంధించిన  వీడియో నెటిజన్లను షాక్‌కు గురిచేస్తోంది.

వామ్మో ! ఇదేం పిచ్చిరా సామీ.. ఐస్‌ బాక్స్‌లో మూడు గంటల  పాటు నిల్చున్నాడు.. ఎందుకో తెలిస్తే..
Guinness World Records
Follow us on

Guinness World Records: అసలే చలికాలంలో.. శీతల వాతావరణంలో చన్నీటి స్నానం చేయాలంటే వణికిపోతాం.. అలాంటిది మంచును చేతులతో పట్టుకోవాలంటే భయపడతారు. కానీ, గడ్డకట్టే చలిలో ఒక వ్యక్తి నిలువునా మంచు పాతరా వేసుకున్నాడు..అంటే అతడు మెడలోతు వరకు ఐస్‌ వేసుకుని మూడు గంటలకు పైగా నిల్చున్నాడు. ఈ వ్యక్తి మంచులో మూడు గంటల పాటు నిలబడి తన పేరు మీద రికార్డు నమోదు చేసుకున్నాడు . దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చివరికి చలి ఎముకలు కొరికే చలి కారణంగా అతని ఆరోగ్య పరిస్థితి క్షిణించినట్టుగా తెలిసింది. గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ ఈ వీడియో షేర్ చేసింది.

వైరల్‌ వీడియోలో ఒక వ్యక్తి ఐస్ బాక్స్‌లో ఎక్కువ సేపు నిలబడి రికార్డు సృష్టించాలనుకుంటున్నాడు. అందుకోసం ముందుగా ఒకపెద్ద  నిలువెత్తు గ్లాస్ బాక్స్ ను తీసుకువచ్చారు, అందులో వ్యక్తి నిలబడి ఉండగా, అతని మెడ వరకు ఐస్ క్యూబ్స్ వేశారు. ఈ వ్యక్తి మూడు గంటలపాటు అందులోనే అలాగే నిల్చున్నాడు. ప్రస్తుతం అతడు చేసిన స్టంట్ కు సంబంధించిన  వీడియో నెటిజన్లను షాక్‌కు గురిచేస్తోంది.

ఇవి కూడా చదవండి

పోలాండ్ నివాసి రోమనోవ్స్కీ అనే వ్యక్తి ఐస్‌ ముక్కల మధ్య ఎక్కువ సేపు నిలబడి రికార్డు సృష్టించాడు. దీని కోసం తాను చాలా కాలంగా ప్రయత్నిస్తున్నానని రోమనోవ్స్కీ చెప్పాడు. ఎన్నోసార్లు ప్రయత్నించి ఇప్పుడు ఈ రికార్డును తన పేరిట లిఖించుకోవడంలో సక్సెస్ అయ్యాడు. ఇంతకుముందు ఈ రికార్డును ఫ్రాన్స్‌కు చెందిన వ్యక్తి రెండు గంటల 35 నిమిషాల 33 సెకన్ల పాటు మంచులో నిలబడ్డాడు. ఫ్రెంచ్‌ వ్యక్తి కంటే ముందు, ఈ రికార్డును 1 గంట 53 సెకన్ల 10 సెకన్ల పాటు మంచు మధ్య నిలబడిన చైనా వ్యక్తి పేరిట ఉంది. నెదర్లాండ్స్ వ్యక్తి రికార్డును బద్దలు కొట్టేందుకు చైనా వ్యక్తి ఐస్ బాక్స్‌లోకి ప్రవేశించాడు. నెదర్లాండ్స్‌కు చెందిన విమ్ హాఫ్ 2013లో ఈ రికార్డును నెలకొల్పాడు. అతను మంచుతో నిండిన పెట్టెలో 1 గంట 53 నిమిషాల 2 సెకన్ల పాటు నిలబడ్డాడు.

అందరి రికార్డులను బద్దలు కొట్టిన రోమనోవ్స్కీ మూడు గంటల 28 సెకన్ల పాటు మంచులో నిల్చున్నాడు. రికార్డును బద్దలు కొట్టిన వెంటనే, రోమనోవ్స్కీని ఐస్‌ బాక్స్‌ నుండి బయటకు తీశారు. వెచ్చని బట్టలు ధరించారు. వైద్యుల బృందం అతని ఆరోగ్య పరిస్థితిని పరీక్షించి, సర్టిఫికేట్ ఇచ్చి సత్కరించింది. దానికి సంబంధించిన వీడియో కూడా అందుబాటులో ఉంది. మంచులో గంటల తరబడి నిలబడి ఈ రికార్డు సృష్టించిన వీడియోను చూసి.. కొందరు పిచ్చి అంటుంటే.. మరికొందరు ప్యాషన్ అంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..