Viral Video: ఓసి నీ ఎంకమ్మ.. మంట కదే.. వాటిలో ఎందుకు దూరావ్ మరి..

నెట్టింట పాముల వీడియోలు తరచుగా వైరల్ అవుతూ ఉంటాయి. ప్రస్తుతం రెయినీ సీజన్ కావడంతో అవి నివాస ప్రాంతాల్లో హల్ చల్ చేస్తున్నాయి. మరుగు ప్రాంతాల్లో దాక్కుని అకస్మాత్తుగా కాట్లు వేస్తున్నాయి. తాజాగా పాముకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది...

Viral Video: ఓసి నీ ఎంకమ్మ.. మంట కదే.. వాటిలో ఎందుకు దూరావ్ మరి..
Snake

Updated on: Sep 10, 2025 | 1:23 PM

సాధారణంగా మనుషులు ఎవరైనా సరే పామును చూడగానే భయపడతారు. వెంటనే అక్కడి నుంచి పరుగులు తీస్తారు. కొంతమంది అయితే బొమ్మ పాము చూసి కూడా సుస్సు పోసుకుంటారు. కలలో కూడా పాము కనిపిస్తే ఒక ఉదుటన లేచి కూర్చుంటారు. అయితే పాములు అంటే భయం ఉంటుంది కానీ.. నెట్టింట వాటి వీడియోలకు మిలియన్స్ కొద్దీ వస్తాయి. తాజాగా అలాంటి ఒక వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. అందులో ఒక పాము పచ్చి మిరపకాయల కుప్ప నుంచి పారిపోవడం చూడవచ్చు. షాపురా_వ్లాగ్స్ అనే అకౌంట్ నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియోలో, ఒక వ్యక్తి పాలిథిన్ బ్యాగ్‌లో నింపిన పచ్చి మిరపకాయలను నేలపై పోశాడు.

దీంతో ఓ ఆవు అవి కూరగాయలు అనుకుని తిందామని అక్కడికి వచ్చింది. అయితే ఆ ఆవు ఒక్కసారిగాద వెనక్కి తగ్గింది. ఏంటా అని చూడగా.. ఆ పచచ్చి మిరపకాయలు నుంచి ఓ చిన్నపాటి పాము బయటకు వచ్చింది. చెంగు చెంగున దూకుతూ అక్కడి నుంచి పారిపోయింది. ఈ వీడియో అక్కడి షాపురా సబ్జీ మండికి ప్రాంతంలో తీసినదిగా చెప్తున్నారు కానీ కన్ఫర్మేషన్ లేదు.

ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో తెగ వైరల్ అవుతోంది. వీడియో పోస్ట్ చేసినప్పటి నుంచి.. మిలియన్ల వ్యూస్ వచ్చాయి. 43 వేలకు మందికి పైగా వీడియోను లైక్ చేశారు. ఇక కామెంట్స్ అయితే ఓ రేంజ్‌లో వస్తున్నాయి. ‘అందులో ఎందుకు దూరావే.. పాపం మండుతున్నట్లు ఉంది’ అని ఓ యూజర్ సరదాగా కామెంట్ చేశాడు. “కూరగాయలు తాజాగా ఉన్నాయో లేదో చూడటానికి దూరినట్లు ఉంది” అని మరొకరు వ్యాఖ్యానించారు.

వీడియో దిగువన చూడండి…