సాటి మనిషి ఆపదలో ఉంటే చూస్తూ ఊరుకోలేం. వారి ఇబ్బందులు తెలుసుకుని వాటిని పరిష్కరించడానికి మనకు తోచినంత సహాయం చేస్తాం. తాము కష్టాల్లో ఉన్నామనో, ఇబ్బందులు ఎదుర్కొంటున్నామనో చెప్పడం ద్వారా తెలుసుకుంటాం. అయితే.. జంతువులు ప్రమాదంలో ఇరుక్కుంటే.. సహాయం కోసం బిక్కుబిక్కుమంటూ ఎదురుచూస్తే.. వాటి కష్టాలు చెప్పడం వర్ణనాతీతం. సరిగ్గా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ (Viral) అవుతోంది. ఆపదలో చిక్కుకున్న జింకను ఓ వ్యక్తి ప్రాణాలకు తెగించి కాపాడాడు. ఏదైనా ప్రాణమే అనుకున్న ఈ వీడియో ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. సాధారణ నేల అని పొరబడిన ఓ జింక.. బురదలో కూరుకుపోయింది. బయటకు రావడానికి ఎంత ప్రయత్నించినా అది సాధ్యపడలేదు. దీనిని నేషనల్ పార్క్‌లో పని చేసే సిబ్బంది గమనించారు. వెంటనే అప్రమత్తమై దాని ప్రాణాలు కాపాడేందుకు పయనమయ్యారు.
This man risked his life to save an impala calf! ❤️️? pic.twitter.com/og05rsdoLq
ఇవి కూడా చదవండి— Tansu YEĞEN (@TansuYegen) July 27, 2022
నడుముకు తాడు కట్టుకుని అందులోకి దిగాడు. నడుం లోతులో కష్టంగా ముందుకు వెళ్లాడు. చాలా సమయం శ్రమించి ఎట్టకేలకు దానిని బయటకు తీశాడు. జింబాబ్వే నేషనల్ పార్క్‌లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్లిప్ కు ఇప్పటివరకు లక్షల సంఖ్యలో వ్యూస్ వచ్చాయి. అనేక మంది లైక్ చేస్తు్న్నారు. సిబ్బంది సాహసానికి సలాం అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి