Viral: ఆన్‌లైన్‌లో ఐఫోన్ ఆర్డర్ పెట్టాడు.. తీరా పార్శిల్ ఓపెన్ చేసి చూడగా.!

రిపబ్లిక్ డే సేల్‌ ఆఫర్‌లో ఐఫోన్ 15 తక్కువ ధరకు వచ్చింది.. ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టాడు ఓ వ్యక్తి. రెండు రోజుల తర్వాత పార్శిల్ ఇంటికొచ్చింది. ఎంతో ఆతృతగా దాన్ని తెరిచి చూడగా.. అతడి మైండ్ బ్లాంక్ అయ్యింది.

Viral: ఆన్‌లైన్‌లో ఐఫోన్ ఆర్డర్ పెట్టాడు.. తీరా పార్శిల్ ఓపెన్ చేసి చూడగా.!

Updated on: Feb 05, 2024 | 1:30 PM

రిపబ్లిక్ డే సేల్‌ ఆఫర్‌లో ఐఫోన్ 15 తక్కువ ధరకు వచ్చింది.. ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టాడు ఓ వ్యక్తి. రెండు రోజుల తర్వాత పార్శిల్ ఇంటికొచ్చింది. ఎంతో ఆతృతగా దాన్ని తెరిచి చూడగా.. అతడి మైండ్ బ్లాంక్ అయ్యింది. దెబ్బకు కళ్లు తిరిగాయ్. ఇంతకీ చివరి ఏం జరిగిందో.. ఇప్పుడు స్టోరీలో చూసేద్దాం.

వివరాల్లోకి వెళ్తే.. ఐఫోన్ 15 ఆర్డర్ పెట్టిన రజావత్ అనే ఓ ఫ్లిప్‌కార్ట్ కస్టమర్‌కి ఫేక్ బ్యాటరీతో కూడిన పాత డివైస్ పార్శిల్‌లో ఇంటికొచ్చింది. ఈ విషయాన్ని అంతటిని అతడు ట్విట్టర్(ఎక్స్) వేదికగా నెటిజన్లతో పంచుకున్నాడు. ‘నేను జనవరి 13న ఫ్లిప్‌కార్ట్ నుంచి ఐఫోన్ 15 ఆర్డర్ చేశాను. దాని పార్శిల్ జనవరి 15వ తేదీనఇంటికొచ్చింది. అందులో ఫేక్ బ్యాటరీతో కూడిన ఓల్డ్ డివైస్ కనిపించింది. అలాగే బాక్స్ ప్యాకేజింగ్ కూడా ఫేక్‌ది గుర్తించాను. ఈ విషయంపై సంస్థకు ఫిర్యాదు చేసినా.. వారు దాన్ని రీప్లేస్ చెయ్యట్లేదు’ అని రజావత్ ఎక్స్‌లో రాసుకొచ్చాడు.

ఈ పోస్ట్‌కు స్పందించిన ఫ్లిప్‌కార్ట్ సంస్థ.. కస్టమర్‌కు క్షమాపణలు చెప్పింది. ‘ఆర్డర్ వల్ల మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. మీ సమస్యను అతిత్వరలో పరిష్కరిస్తాం. దయచేసి మీ ఫ్లిప్‌కార్ట్ ఖాతా నుంచి ప్రైవేట్ మెసేజ్ ద్వారా మీ ఆర్డర్ ఐడీని పంపండి. తమ బ్రాండ్‌ని అనుకరిస్తూ.. కొన్ని తప్పుడు సంస్థలు కస్టమర్లను మోసం చేస్తుంటాయి. అలాంటి వాటిని మీరు స్పందించవద్దు.’ అని రిప్లయ్ ఇచ్చింది.(Source)