Viral video : రన్నింగ్ కారులో రొమాన్స్.. ఏకంగా స్టీరింగ్ వదిలేసి అమ్మాయితో..

మొన్నటి వరకు టిక్ టాక్ అంటూ చాలా మంది పిచ్చి పిచ్చి వేషాలు వేసి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. దాంతో అది కాస్తా బ్యాన్ అయ్యింది మనదగ్గర. కానీ ఇప్పుడు ఇన్ స్ట్రాగ్రామ్ రీల్స్ అంటూ అలాంటిపనులే చేస్తున్నారు.

Viral video : రన్నింగ్ కారులో రొమాన్స్.. ఏకంగా స్టీరింగ్ వదిలేసి అమ్మాయితో..
Viral Video

Updated on: Mar 15, 2023 | 7:01 PM

సోషల్ మీడియా పుణ్యమా అని రకరకాల వింతలు విడ్డురలు చూడాల్సి వస్తోంది. మొన్నటి వరకు టిక్ టాక్ అంటూ చాలా మంది పిచ్చి పిచ్చి వేషాలు వేసి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. దాంతో అది కాస్తా బ్యాన్ అయ్యింది మనదగ్గర. కానీ ఇప్పుడు ఇన్ స్ట్రాగ్రామ్ రీల్స్ అంటూ అలాంటిపనులే చేస్తున్నారు. కొంతమంది పబ్లిక్ గానే రొమాన్స్ చేస్తున్నారు. ఇంకొంతమంది డేంజర్ స్టాంట్స్ చేసిన నెటిజన్లకు షాక్ ఇస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి ఏకంగా కారు స్టీరింగ్ వదిలేసి అమ్మయితే ఇలా రొమాన్స్ చేశాడు. ఇప్పుడు ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఈ వైరల్ వీడియోలో ఓ వ్యక్తి హైవే పై కారు నడుపుతూ.. స్టీరింగ్ వదిలేసి పక్క సీట్ లో ఉన్న అమ్మాయితో సరదాగా గొడవపడుతూ.. ఆ అమ్మాయిని హగ్ చేసుకోవడం.. చేతులు పట్టుకోవడం లాంటివి చేశాడు. అంతే కాదు కొంత సేపటి తర్వాత పక్క సీట్ పై కాళ్ళు కూడా పెట్టాడు.

కారు స్టీరింగ్ ను ఆటోమేటిక్ అడ్జెస్ట్ మోడ్ లో ఉంచి ఆ వ్యక్తి ఇలా పక్కన ఉన్న అమ్మాయితో సరసాలాడటం చేశాడు. ఈ దంతా వెనక సీట్ లో ఉన్న వ్యక్తి వీడియో తీశాడు. ఇప్పుడు ఈ వీడియో కాస్త వైరల్ అవ్వడంతో.. అతడిపై పోలీసులు యాక్షన్ తీసుకున్నారని తెలుస్తోంది. రోడ్ల పై ఇలా నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం సరికాదు అని పోలీసులు అంటున్నారు. ఆ వ్యక్తి మాత్రం రీల్స్ కోసం ఇలా చేశానని చెప్పుకొచ్చాడు. మొత్తానికి ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి .