
ఇటీవల మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు ఎక్కువైపోయాయి. వయసుతో సంబంధం లేకుడా మృగాళ్లు విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో ఓ తండ్రి తన కుమార్తెను కంటికి రెప్పలా కాదు.. నిఘాకళ్లతో రక్షణ కల్పించాలనుకున్నాడు. ఏదైనా అనుకోని సంఘటన జరిగితే తక్షణ ఆధారాలు లభించేలా ఏర్పాటు చేశాడు. ఇంతకీ ఆ తండ్రి ఏం చేశాడో తెలుసా? తన కుమార్తె తలపై సీసీ కెమెరా అమర్చాడు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పాకిస్థాన్‌కు చెందిన వలీద్ సాహబ్ అనే వ్యక్తి ఇలా తన కూతురి తలపై సీసీ కెమెరా అమర్చి వార్తల్లో నిలిచారు. ఈ క్రమంలో సెక్యూరిటీ కెమెరా తలపై పెట్టుకుని తిరుగుతున్న ఆ యువతిని పలకరించడంతో ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తండ్రి తీసుకున్న నిర్ణయానికి మీరు అభ్యంతరం చెప్పలేదా? అని ఆమెను అడిగినప్పుడు.. తన తండ్రి తన కోసం ఏ నిర్ణయం తీసుకున్నా తాను అంగీకరిస్తానని చెప్పింది.తన తండ్రి తనను ఆ సెక్యూరిటీ కెమెరా ద్వారా 24 గంటలూ పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. ఇదంతా తన భద్రత కోసమేనని చెప్పుకొచ్చింది. తండ్రి నిర్ణయానికి గల కారణం కూడా వివరించింది. ఇటీవల కరాచీలో సంచలనం సృష్టించిన హిట్ అండ్ రన్ కేసు కారణంగానే తన తండ్రి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ యువతి పేర్కొంది. ఎవరైనా తనను యాక్సిడెంట్‌లో చంపినా కనీసం సాక్ష్యం ఉంటుందని చెప్పుకొచ్చింది. అందుకే ఇలా తలపై సీసీ కెమెరాతో తిరుగుతున్నట్లు తెలిపింది. కాగా, కరాచీలో సంపన్న కుటుంబానికి చెందిన ఓ మహిళ తన ఎస్‌యూవీ కారుతో తండ్రి, కూతురు వెళ్తున్న ఓ వాహనాన్ని ఢీకొట్టింది. దాంతో వారిద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. గత సోమవారం కరాచీలోని కర్సాజ్ రోడ్డులో ఈ ఘటన జరిగింది.
Pakistan🫡😭
pic.twitter.com/Hdql8R2ejt— Ghar Ke Kalesh (@gharkekalesh) September 6, 2024
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..