వినాశనాలకే విపరీత బుద్దులు అన్నట్లు.. ఇరాన్‌కు చెందిన ఓ 30 ఏళ్ల వ్యక్తి తన పురషనాళం ద్వారా 8 అంగుళాల డియోడరెంట్ డబ్బాను జొప్పించుకున్నాడు. కట్ చేస్తే.. పొత్తికడుపులో తీవ్రమైన నొప్పి.. విలవిలలాడుతూ రెండు గంటల వ్యవధిలోనే ఆసుపత్రిలో చేరాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఎక్స్‌రే ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.
విజువల్ జర్నల్ ఆఫ్ ఎమర్జెన్సీ సర్జరీలో ప్రచురించబడిన ఒక కేస్ స్టడీ ప్రకారం, 30 ఏళ్ల ఇరానీయన్ వ్యక్తి తన పురషనాళంలోకి సుమారు 8 అంగుళాల డియోడరెంట్ డబ్బాను చొప్పించిన రెండు గంటల్లో ఆసుపత్రి పాలయ్యాడు. తీవ్రమైన పొత్తి కడుపులో నొప్పితో సదరు బాధితుడు హాస్పిటల్‌కు వచ్చాడని వైద్యులు తెలిపారు. అతడికి వికారం, వాంతులు, మల రక్తస్రావం, అసాధారణ ప్రేగు కదలికలు లాంటి లక్షణాలు ఏవి లేవని గుర్తించారు. ఎక్స్‌రే తీయగా.. అతడి కడుపులో 8 అంగుళాల డియోడరెంట్ డబ్బా ఉన్నట్లు గుర్తించారు. ఆ వెంటనే సదరు వ్యక్తికి శస్త్రచికిత్స నిర్వహించి.. డియోడరెంట్ డబ్బాను కడుపులో నుంచి బయటకు తీశారు. కాగా, ఆ వ్యక్తి ఆపరేషన్ అయిన రెండో రోజే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు.(Source)