
కొన్నిసార్లు అదృష్టం ఎవరూ నమ్మలేని అద్భుతాలు చేస్తుంది. ఒక అమెరికన్ యువకుడికి అలాంటిదే జరిగింది. అతను ఒక చిన్న దుకాణం నుండి కొన్న సూట్ జాకెట్ జేబులో 700 డాలర్లు (సుమారు 58,000 రూపాయలు) లభించాయి. ఈ ఆశ్చర్యకరమైన సంఘటన అతని ఆర్థిక ఇబ్బందులను పరిష్కరించడమే కాకుండా సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. అమెరికాకు చెందిన యువకుడు డేవిడ్ (యూజర్‌నేమ్ u/davidudeman) ఆగస్టు 31న తనకు ఎదురైన అనుభవాన్ని చెప్పాడు. ఇందుకు సంబంధించి డేవిడ్ కొన్ని ఫోటోలను కూడా షేర్ చేశాడు. అందులో జాకెట్ జేబులో నుండి 100-100 డాలర్ల నోట్లు బయటకు రావడం కనిపించింది. కాగా, ఈ పోస్ట్‌కు ఇప్పటివరకు 26,000 కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి.
అతని అలవాటు తన అదృష్టాన్ని మార్చింది:
డేవిడ్ మీడియాతో మాట్లాడుతూ, తనకు 20 ఏళ్లు ఉన్నాయని, తనకు చాలా సంవత్సరాలుగా సెకండ్ హ్యాండ్ స్టోర్లలో వస్తువులు కొనే అలవాటు ఉందని చెప్పాడు. అయితే, పాత వస్తువులు కొంటున్నప్పుడు జేబులను చెక్ చేయాలని చాలా మంది సలహా ఇస్తారు. ఈ అలవాటు అతని విధిని మార్చింది. గత ఒకటి-రెండు సంవత్సరాలుగా, తాను పాత వస్తువుల దుకాణానికి వెళ్ళినప్పుడల్లా కొన్ని బట్టల జేబులను చెక్ చేసేవాడినని డేవిడ్ చెప్పాడు. ఈసారి అతను సూట్ విభాగానికి వెళ్లి జాకెట్ల జేబుల లోపల చూడటం ప్రారంభించాడు.
దాదాపు పదవ జాకెట్ జేబులో అతనికి ఒక కట్ట కనిపించింది. అది మొదట బొమ్మ నోట్లు లేదా నకిలీ నోట్లు అని భావించాడట. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా జాకెట్ కొని తన కారు వద్దకు వెళ్లి కట్టను తెరిచాడు. అది 100 డాలర్ల నోట్లు ఉన్న బ్యాంక్ ఎన్వలప్. మొదట అది 200 డాలర్లు మాత్రమే ఉంటుందని అనుకున్నాడు. కానీ లెక్కిస్తున్నప్పుడు ఆ మొత్తం 700 డాలర్లకు చేరుకుందని అతను చెప్పాడు.
OKAY… UHMMM I JUST FOUND $700 CASH IN A SUIT POCKET AT GOODWILL!!!!!!!!!
byu/Davidudeman inThriftStoreHauls
ఆర్థిక సంక్షోభంలో ఆ డబ్బు ఆదుకుంది:
మొదట 200 డాలర్లు మాత్రమే అనుకున్న డేవిడ్..నోట్లు లెక్కిస్తూ పోగా, అది 700 డాలర్లు కావడంతో తనను తాను నమ్మలేకపోయాడు. ఆశ్చర్యపోయానని చెప్పాడు.. ఇది నాకు ఒక అద్భుతం అని చెప్పాడు. ఇటీవల తన ఆర్థిక పరిస్థితి చాలా దిగజారిందని, ఎవరో ఒకరు తనను ఆదుకుంటే బాగుండునని ఆశిస్తున్నానని డేవిడ్ చెప్పాడు. డబ్బు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నాను, ఏదైనా మ్యాజిక్‌లాంటిది జరగాలని ప్రార్థిస్తున్నాను. అలాంటి సమయంలో ఈ మొత్తాన్ని పొందడం నాకు పెద్ద ఉపశమనం అని అతను రాశాడు. అయితే, అతను ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేయలేదు. కానీ, తనకు దొరికిన నోట్స్ ఫోటోలను షేర్ చేశాడు. అతను సంతోషంతో వీడియోలో గట్టిగా అరవడం మాత్రం కనిపిస్తుంది. ఈ పోస్ట్‌పై నెటిజన్లు పెద్ద సంఖ్యలో స్పందంచారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..