ఈ మధ్య కాలంలో రోడ్డుపై ప్రమాదాలు (Accident) నిత్యకృత్యంగా మారాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు ప్రమాదాల సంఖ్య పెరుగుతున్నాయి. రోడ్డు నియమాలు పాటించకపోవడం, అతివేగం, నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య అధికంగా ఉంటోంది. ఏ వాహనంలో వెళ్లకపోయినా కనీసం రోడ్డుపై నడుస్తూ వెళ్లినా ప్రమాదాలు జరుగుతుండటం గమనార్హం. మనంతట మనం జాగ్రత్తగా వెళ్తున్నా వెనుక నుంచి ఏదో ఒక వాహనం వచ్చి ఢీ కొడుతోంది. కొన్ని సార్లు వీటి కారణంగా తీవ్ర గాయాలు కావచ్చు. మరికొన్ని సార్లు ప్రాణాలే కోల్పోవచ్చు. కానీ అప్పుడప్పుడు మాత్రం ప్రమాద తీవ్రత చాలా ఉన్నప్పటికీ ఎవరికీ ఏమీ కాకపోవడం విశేషం. అందుకే రోడ్డు మీద నడిచేటప్పుడు, రోడ్డు దాటేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన తర్వాత నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ క్లిప్ లో ఒక వ్యక్తి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటాడు. అదే సమయంలో వేగంగా వస్తున్న ఓ బస్సు అదుపు తప్పి వెనక నుంచి వచ్చి అతడిని ఢీ కొట్టిన దృశ్యాలను చూడవచ్చు. బస్సును గుర్తించే సరికే అతడిని ఢీ కొట్టింది. అదృష్టవశాత్తూ అతనికి ఎలాంటి గాయాలు కాకపోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
I like how he calmly picks himself up and goes into the pub for a pint pic.twitter.com/bqzsQXC8ej
ఇవి కూడా చదవండి— Vicious Videos (@ViciousVideos) September 2, 2022
ప్రమాద తీవ్రతకు అక్కడే ఉన్న స్తంభం ధ్వంసం అవడాన్ని గమనించవచ్చు. పెద్ద ఇనుప రాడ్లు కింద పడిపోయాయి. ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. కేవలం 23 సెకన్ల నిడివి కలిగిన ఈ వీడియోకు ఇప్పటివరకు 24 వేలకు పైగా వ్యూ్స్, వందల సంఖ్యలో లైక్స్ వస్తున్నాయి. వీడియో చూసిన తర్వాత ప్రజలు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..