Viral Video: బైక్‌తో స్టంట్స్ చేయాలనుకున్నాడు.. కట్ చేస్తే సీన్ రివర్సయింది.. సోషల్ మీడియాలో ట్రెండింగ్!

|

Apr 02, 2022 | 1:47 PM

వైరల్ వీడియోలకు సోషల్ మీడియాలో కేంద్ర బిందువు. ఎప్పుడూ ఏదొక వైరల్ వీడియో నెట్టింట హల్చల్ చేస్తూనే ఉంటుంది..

Viral Video: బైక్‌తో స్టంట్స్ చేయాలనుకున్నాడు.. కట్ చేస్తే సీన్ రివర్సయింది.. సోషల్ మీడియాలో ట్రెండింగ్!
Bike Stunt
Follow us on

వైరల్ వీడియోలకు సోషల్ మీడియాలో కేంద్ర బిందువు. ఎప్పుడూ ఏదొక వైరల్ వీడియో నెట్టింట హల్చల్ చేస్తూనే ఉంటుంది. ఈ మధ్యకాలంలో యువత ఓవర్‌నైట్‌లోనే బాగా ఫేమస్ అయ్యేందుకు అక్కర్లేని స్టంట్స్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. లైకులు, వ్యూస్ కోసం భయంకరమైన స్టంట్స్ ప్రయత్నిస్తున్నారు. తాజాగా అలాంటి కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది.

వైరల్ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి బైక్‌తో స్టంట్స్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు మీరు చూడవచ్చు. బైక్ ముందు చక్రం పైకి లేపుతూ ఒకసారి.. చేతులు వదిలేసి మరోసారి.. ఇంకోసారి ఏకంగా బైక్ నుంచి ఎగిరి.. పక్కనే దానితో పరిగెడుతూ వేషాలు వేశాడు.. ఇక్కడ అతడు అనుకున్నది ఒకటయితే.. మరొకటి జరిగింది. సీన్ కాస్తా రివర్సయింది. బైక్‌తో సహా 32 పళ్లు రాలేలా బొక్కబోర్లా పడ్డాడు. ఇంకా నయం అతగాడి అదృష్టం బాగుంది కాబట్టి పడినా.. పైకి లేచాడు. అంత దారుణంగా కింద పడ్డా. బతికి బయటపడ్డాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. నరకానికి షార్ట్ కట్ కోసం వెతకకుండా.. ఇకనైనా మారరా నాయనా అంటూ ఆ వ్యక్తిని తిడుతున్నారు.

Also Read: Optical Illusion: ఈ ఫోటోలో మొదట చూసేదే మీ అతిపెద్ద బలం, బలహీనత.. అదేంటో తెలుసుకోండి!