Viral: ఒకే రోజు 23 పళ్లు పీకి, 12 కొత్త పళ్లు అమర్చిన సర్జన్.. 13 రోజుల తర్వాత..

|

Sep 12, 2024 | 10:38 AM

చైనాలో షాకింగ్ ఇన్సిడెంట్ వెలుగుచూసింది. దంత ప్రక్రియ అయిన కొన్ని రోజులకు ఓ వ్యక్తి.. అనూహ్య రితీలో మరణించాడు. ఈ ఘటనపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ డీటేల్స్ తెలుసుకుందాం పదండి...

Viral: ఒకే రోజు 23 పళ్లు పీకి, 12 కొత్త పళ్లు అమర్చిన సర్జన్.. 13 రోజుల తర్వాత..
Dental Procedure
Follow us on

ఒకే రోజు 23 పళ్లను తొలగించి, 12 కొత్త పళ్లను అమర్చిన 13 రోజుల తర్వాత ఒక చైనీస్ వ్యక్తి మరణించడం చర్చనీయాంశమైంది.  తూర్పు చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌లోని జిన్‌హువాకు చెందిన ఓ యువతి సెప్టెంబర్ 2న చేసిన ఆన్‌లైన్ పోస్ట్ ద్వారా ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ఆమె తండ్రి హువాంగ్‌ ఆగస్టు 14న యోంగ్‌కాంగ్ దేవే డెంటల్ హాస్పిటల్‌లో సుధీర్ఘమైన డెంటర్ చికిత్స తీసుకున్నట్లు ఆమె తెలిపింది. అక్కడి డెంటల్ సర్జన్ “తక్షణ పునరుద్ధరణ”(immediate restoration) పద్ధతిని అనుసరించారు.  ఈ ప్రక్రియలో భాగంగా 23 పళ్ళు పీకివేశారు. అంతే కాకుండా 12 దంతాలు కొత్తగా ఇంప్లాంట్ చేశారు. ఈ ప్రక్రియ చేసిన సర్జన్‌కు సర్వీస్‌లొ ఐదేళ్ల అనుభవం ఉందని తెలిసింది. రూట్ కెనాల్ ట్రీట్‌మెంట్, పళ్లను పీకడం, ఇతర దంత చికిత్సలలో ఎంతో నిష్ణాతుడట. అయితే చికిత్స తర్వాత, హువాంగ్ కంటిన్యూగా నొప్పితో బాధపడ్డాడు. ఆ తర్వాత పదమూడు రోజుల తర్వాత హఠాత్తుగా గుండెపోటుతో మరణించాడు.

అతనికి చికిత్స చేసిన ఆసుపత్రి ఉద్యోగులు మాట్లాడుతూ..  ఒక సెషన్‌లో ఎన్ని దంతాలు తొలగించాలనేది రోగి ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుందని.. ఆ విషయాన్ని కన్సల్టింగ్ డాక్టర్ నిర్ణయిస్తారని చెప్పారు.  సాధారణంగా ముందు వైపు పళ్లను ఒకరోజు తీసి అమర్చవచ్చు అని.. వెనకవైపు దంతాలు రిమూవ్ చేయడానికి, ఇంప్లాంటేషన్ మధ్య మూడు నుండి నాలుగు నెలల సమయం అవసరమని అక్కడి సిబ్బంది ఒకరు చెప్పారు. అయినప్పటికీ.. హువాంగ్‌కు వెనక దంతాలను కూడా అదే రోజు పీకి అమర్చినట్లు.. అతను సైన్ చేసిన కన్సెంట్ డాక్యూమెంట్‌లో ఉంది. దంత ప్రక్రియకు,  హువాంగ్ మరణానికి మధ్య 13 రోజుల గ్యాప్ ఉన్నందున, ఈ కేసును ఇంకా లోతుగా పరిశీలిస్తున్నట్లు అక్కడి హెల్త్ కమిషన్ తెలిపింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..