
Viral Video: లోతైన సముద్రంలో ఒక వ్యక్తి బోర్డింగ్ చేస్తున్నాడు. సడెన్‌గా అతడికి ఒక పాము ఎదురైంది. దీంతో అతడు దానిని ఎలా ఎదుర్కొన్నాడో సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఊహించని పరిణామంతో ఏ మనిషైనా సరే ఒక్కసారిగా ఉలిక్కి పడుతాడు. బోర్డింగ్ చేస్తున్న వ్యక్తి కూడా అలాగే ఫీలయ్యాడు. అంతేకాదు అతడు దాని నుంచి ఎలా తప్పించుకున్నాడో తెలుసుకుందాం.
వీడియోలో ఒక పాము బోర్డింగ్‌కి కొద్ది దూరంలో కనిపించడం గమనించవచ్చు. అది అక్కడి నుంచి వేగంగా బోర్డింగ్ చేస్తున్న వ్యక్తి వైపునకు దూసుకొస్తుంది. పడవ పక్కకు వచ్చి తల ఆనించి ఎక్కడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు ఆ వ్యక్తి చేయితో ఆపుతూ దానికి సైగ చేయడం మనం చూడవచ్చు. అది గమనించిన పాము వెనక్కి మళ్లీ పరుగెడుతుంది. పడవకు దూరంగా వెళ్లి సముద్రంలో మునిగి కనిపించకుండా పోతుంది. అప్పుడు ఆ వ్యక్తి ఆనందం మనం వీడియోలో చూడవచ్చు.
సముద్రపు పాములు సాధారణంగా మనుషుల దగ్గరికి రావు. ఇవి చాలా చురుకుగా ఉంటాయి. ఈ వీడియో 729k వ్యూస్‌ని సాధించింది. అలాగే మరో వీడియోలో పడవ కింది నుంచి తిమింగళం వెళ్లడం మనం గమనించవచ్చు. సాధారణంగా తిమింగిళాలు కొన్ని మనుషులకు హాని తలపెడతాయి. దాడి చేయడానికి అవకాశం కోసం ఎదురుచూస్తాయి. వీడియో పడవ కింది నుంచి వెళ్లినప్పుడు చాలా భయపడ్డానని ఆ వ్యక్తి తెలిపాడు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.