భారతీయ వివాహాలు అందరికంటే భిన్నంగా జరుగుతాయి. వివాహ వేదిక , ధరించే దుస్తుల గురించి మాత్రమే కాదు.. విందు వినోదంతో పాటు.. పెళ్లివారింటికి వెళ్లే వాహనం వరకూ అన్నీ వెరీ వెరీ స్పెషల్. పెళ్లి కోసం ఆహూతులందరు ఒక్కసారే ప్రయాణనిస్తూ.. తమ స్నేహతులతో, సన్నిహితులతో చేసే అల్లరి గురించి ఎంత చెప్పినా తక్కువే. కుటుంబ సమేతంగా చుట్టాలు, స్నేహితులతో ప్రయాణించడానికి చాలా మంది బస్సులు లేదా రైళ్లను బుక్ చేసుకుంటారు. ఇది దేశవ్యాప్తంగా సాధారణ దృశ్యం అయితే.. తమ కుటుంబాన్ని పెళ్లికి తీసుకెళ్లేందుకు మొత్తం విమానాన్ని బుక్ చేసుకున్న ఘటనలు గురించి విన్నారా.. దేశ వ్యాప్తంగా ఎదురుగా ఇటువంటి సంఘటలు జరుగుతూ ఉంటాయి. తాజాగా ఇంస్టాగ్రామ్ లో theshubhwedding లో ఓ వీడియో షేర్ చేశారు. ఈ వీడియోలో, విమానంలో ప్రయాణిస్తున్న ఓ మొత్తం కుటుంబాన్ని చూడవచ్చు. వివాహ వేదికకు అందరూ కలిసి వెళ్తున్న సమయంలో వీడియో తీస్తుంటే.. బంధువులు కెమెరాకు హ్యాపీగా చేతులు ఊపుతూ ఫోజులిచ్చారు.
ఇక్కడ వీడియోను చూడండి:
ఈ వీడియో ఒక వారం క్రితం షేర్ చేయబడింది. 33,000 లైక్స్ తో పాటు భారీగా కామెంట్స్ ను సొంతం చేసుకుంది. “నేను నిజంగా ప్లైట్ లో ప్రయాణించాలని ఆసక్తిగా ఉన్నాను. దీనికి ఎంత ఖర్చవుతుంది? ధర మాత్రం తెలిస్తే చాలు అని తన కోరికను ఓ వ్యక్తి వ్యక్తం చేశాడు. రెండవ వ్యక్తి, “లక్కీ గర్ల్” అని అన్నాడు. “అందరి టిక్కెట్టు బుక్ చేయడానికి ఎంత డబ్బు ఖర్చు చేశాడు.. ఇది కంప్లీట్ ఫ్లైట్ బుక్” అని ప్రశ్నించాడు. చాలా మంది హార్ట్ అండ్ ఫైర్ ఎమోజీలను ఉపయోగించి తమ ఫీలింగ్స్ ను వ్యక్త పరుస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..