
కొలంబియాలోని కార్టజేనాలోని రాఫెల్ నునెజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 40 ఏళ్ల కొలంబియన్ వ్యక్తిని అరెస్టు చేశారు. అతను పెట్టుకున్న హెయిర్ విగ్ లోపల కొకైన్‌ను దాచి అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నించాడు. ఆమ్స్టర్డామ్‌కు విమానం ఎక్కేందుకు సిద్ధంగా ఉన్న పెరీరాకు చెందిన ఆ వ్యక్తి విగ్‌లో 220 గ్రాముల (7.76 ఔన్సులు) కంటే ఎక్కువ కొకైన్ ఉందని పోలీసులు కనుగొన్నారు. ఎయిర్‌పోర్ట్‌లో స్కాన్ చేస్తుండగా.. అతని విగ్ అనుమానాస్పదంగా అనిపించింది. దీంతో కాస్త పరీక్ష పెట్టగా.. లోపల డ్రగ్స్ ఉన్నట్లు కనుగొన్నారు. బాడీ స్కాన్ నుండి తీసిన ఫుటేజ్‌లో భారీ మొత్తంలో కొకైన్ ఉన్నట్లు వెల్లడైంది. బిబిసి ప్రకారం , ఆ డ్రగ్స్ విలువ దాదాపు $10,450 (రూ. 910,828). ఈ డ్రగ్స్ మొత్తాన్ని 400 డోసులుగా విభజించినట్లు గుర్తించారు.
𝙄𝙉𝙏𝙀𝙍𝙉𝘼𝘾𝙄𝙊𝙉𝘼𝙇𝙀𝙎 //
ALERTA AEROPUERTO NARCOPELUCA🗣Un hombre oriundo de Pereira fue capturado en el aeropuerto internacional Rafael Núñez de Cartagena cuando intentaba abordar un vuelo con destino a Países Bajos con cocaína oculta en una peluca pic.twitter.com/0lHxDWVS4X
— Ing Julio Robles (@ingjuliorobles) February 25, 2025
ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం , కొలంబియా ప్రపంచంలో కొకైన్ ఎగుమతి చేసే దేశాల్లో టాప్ ప్లేసులో ఉంది. 2023 లో ఆ దేశం కోకా ఆకు సాగు, ఉత్పత్తి విషయంలో కొత్త రికార్డును సృష్టించింది. 2022లో పొలిస్తే 2023లో ఆ దేశంలో కొకైన్ ఉత్పత్తి 53 శాతం పెరిగి 1,738 టన్నుల నుంచి 2,600 కి చేరుకుందని UN ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ (UNODC) తెలిపింది. 2001లో UN పర్యవేక్షణ ప్రారంభించినప్పటి నుంచి ఇవే టాప్ నంబర్స్ అని చెబుతున్నారు. కొలంబియన్ కొకైన్‌లో ఎక్కువ భాగం యునైటెడ్ స్టేట్స్, యూరప్‌కు రవాణా చేస్తున్నారు. కోకా ఆకు ఉత్పత్తి ఇప్పుడు ఆ దేశంలో 253,000 హెక్టార్లలో (625,100 ఎకరాలు) విస్తరించి ఉంది.