‘పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి’ అనే సామెత తెలిసే ఉంటుంది. అసలు ఊహించడానికి కూడా అవకాశం లేనివి చూసినప్పుడు ఈ సామెతను ఉపయోగిస్తుంటారు. ఒక్కొక్కరి ఆలోచన ఒక్కోలా ఉంటుంది. అయితే ఆ ఆలోచనలు అందరూ ఆమోదించేలా ఉంటే అంతా బాగానే ఉంటుంది. కానీ సమాజానికి భిన్నంగా ఉన్నప్పుడే ఆశ్చర్యపరుస్తుంటుంది. కొన్ని సందర్భాల్లో ముక్కున వేలేసుకునేలా ఉంటాయి. తాజాగా నెట్టింట వైరల్ అవుతోన్న ఓ వీడియో ఇదే కోవలోకి వస్తుంది.
సాధారణంగా డెయిరీ మిల్క్ చాక్లెట్‌ని ఎవరైనా నేరుగా తింటారు. అలా కాకుండా చాక్లెట్‌తో పకోడీలో చేస్తే ఎలా ఉంటుంది. పిండిని వేడి నూనెలో వేయించినట్లు చాక్లెట్‌ను వేయిస్తే ఎలా ఉంటుంది.? ఏంటి వినడానికే విచిత్రంగా ఉంది కదూ. కానీ ఒకావిడ చాక్లెట్‌తో పకోడీలు చేశారు. అంతేనా కస్టమర్లు ఎగబడి మరీ కొనుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. చాక్లెట్‌తో పకోడీలు చేయడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు.
ఇక ఈ వీడియో చూసిన కొందరు అసలు ఇదేం పని అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం ఇదంతా ఏదో స్టంట్ అంటూ అనుమానం వ్యక్తం వేస్తున్నారు. లైక్‌లు, వ్యూస్ కోసమే ఇలా చేశారని, అసలు చాక్లెట్‌ను నూనెలో వేయిస్తే ఎలా తినగలరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఇప్పుడీ చాక్లెట్ పకోడీ మాత్రం నెట్టింట పెద్ద చర్చకే దారి తీసింది.
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..