Viral Video: ఓర్నీ.. హోం వర్క్ చేసే మెషీన్ కూడా వచ్చేసిందిగా..

|

Aug 15, 2024 | 10:25 AM

హా.. ఇప్పటికే ఫోన్ల వల్ల పిల్లల చదువు నాశనం అయిపోయింది. ఈ మెషీన్ అందుబాటులోకి వస్తే పిల్లల జీవితాలు గల్లంతే అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. ఈ మెషీన్ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉందా అని మరో కుర్రాడు ప్రశ్నించాడు.

Viral Video: ఓర్నీ.. హోం వర్క్ చేసే మెషీన్ కూడా వచ్చేసిందిగా..
Homework Machine
Follow us on

కొంతమంది పిల్లలు హోం వర్క్ చేయకుండా మొండికేస్తారు. ఫలితంగా స్కూల్లో టీచర్‌తో తిట్లు, తన్నులు తింటారు. ఇంకొందరు ఇస్మార్ట్ గాళ్లు ఉంటారు. వాళ్లు ఫ్రెండ్స్‌తో హోం వర్క్ చేయిస్తారు. ఇకపై హోం వర్క్ చేయడానికి ఇన్ని బాధలు అవసరం లేదు. హోం వర్క్ చేసే కిర్రాక్ మెషీన్ వచ్చేసింది. ఇంటర్నెట్‌లో రెండు వేల సంఖ్యలో వీడియోలు సర్కులేట్ అవుతూ ఉంటాయి. అందులో కొన్ని వీడియోలు.. జనాల్ని ఆశ్చర్యపరుస్తాయి. పిల్లల హోంవర్క్ ఒత్తిడిని పూర్తిగా తొలగించే యంత్రాన్ని మీరు చూడవచ్చు.

పాఠశాలకు వెళ్లే పిల్లలకు, హోంవర్క్ చేయడం ముఖ్యమైన అంశం. పిల్లలు క్లాసులో నేర్చుకునేది గుర్తుంచుకోవడానికి హోంవర్క్ చాలా ముఖ్యం. అయితే, చాలా మంది పిల్లలు హోంవర్క్ చేయకుండా బద్దకిస్తారు. మేడమ్ ఎందుకు చేయలేదు అని అడిగితే.. ఒక సాకును ఎప్పుడూ రెడీగా ఉం చుకునే పిల్లలు కొందరు ఉన్నారు. అయితే ఇకపై ఇలా సాకులు చెప్పాల్సిన పనిలేదు.

ఇక్కడ వీడియో చూడండి

వీడియోలో స్పైరల్ కాపీలో చకచకా హోం వర్క్ చేస్తోన్న మెషీన్‌ను మీరు చూడొచ్చు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఈ మెషీన్ మనుషుల్లానే రాస్తున్నట్లు కనిపిస్తోంది. దూరం నుండి చూస్తే, ఎవరో హోం వర్క్ చేసుకుంటున్నారని మీకు అనిపిస్తుంది. కానీ వాస్తవానికి ఇది ఒక యంత్రం. ఈ వీడియో @HasnaZaruriHai అనే ఖాతా నుంచి Xలో షేర్ చేశారు. ఈ వార్త రాసే వరకు వేల మంది దీనిని చూసి కామెంట్ చేస్తూ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..