సాధారణంగా చేపలు పట్టేందుకు వెళ్తే కొన్ని సార్లు ఊహించని సంఘటనలు చోటు చేసుకుంటాయి. చేపలను పట్టేందుకు వల వస్తే.. వాటికి బదులుగా వేరే జీవులు వలకు చిక్కుకుంటాయి. కానీ ఓ వ్యక్తి వలకు చిక్కిన చేప కోసం ఏకంగా మొసలి రంగంలోకి దిగింది. ఎలాగైనా చేపను లాగించాలను చేపను అనుసరిస్తూ ఒడ్డుకు చేరింది. చేపలను పట్టడానికి వచ్చిన వ్యక్తులకు ఎదురుగా వెళ్లింది. అడుగు దూరంలోనే మొసలి ఉన్న అక్కడున్న వారు ఏమాత్రం భయపడకుండా మొసలిని బెదిరించే ప్రయత్నం చేశారు. ఈ భయంకరమైన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఓ తండ్రికొడుకులు ఇద్దరు చేపలను పట్టేందుకు ఓ నది వద్దకు వెళ్లారు. చేపలను పట్టేందుకు గాలం వేయగా.. వారి గాలానికి ఓ చేప చిక్కింది. దీంతో దానిని నెమ్మదిగా బయటకు లాగేందుకు ప్రయత్నం చేశారు. అయితే ఆ చేపకు కొద్ది దూరంలో ఉన్న మొసలి చేపను తినడానికి ప్రయత్నించింది. దీంతో వారు చేపను ఒడ్డుకు వేగంగా ఒడ్డుకు తీసుకువచ్చేందుకు ప్రయత్నించగా.. దానిని అనుసరిస్తూ.. మొసలి కూడా ఒడ్డుకు వచ్చేసింది. దీంతో ఆ వ్యక్తి చేపను పూర్తిగా తన చేతుల్లోకి తీసుకుని వెనక్కు జరిగాడు.. అక్కడే ఉన్న అతని తండ్రి ఏమాత్రం భయపడకుండా ఆ మొసలికి ఎదురెళ్లాడు. అయితే మొసలి అక్కడే ఆగిపోవడంతో.. తండ్రికొడుకులిద్దరూ ప్రాణాలతో భయపడ్డారు. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని కాకడులో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ భయంకరమైన వీడియో చూసిన నెటిజన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Also Read: Mahesh Babu: ఆ మ్యాగజైన్‌కు థ్యాంక్స్ చెప్పిన మహేష్.. ఆ అనుభవం చాలా సరదాగా ఉందంటూ కామెంట్..
Sarkaru Vaari Paata: త్రివిక్రమ్‌తో చేయబోయే సినిమా జోనర్ అలాంటిదే.. మహేష్ బాబు కామెంట్స్..