ముంబై రైల్వే స్టేషన్‌లో కిక్కిరిసిన జనం రైలు ఎక్కేందుకు ఎలాంటి ఇబ్బందులు పడుతుంటారో అనేక వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తాయి. ఇటీవల తుఫాను కారణంగా ముంబై లైఫ్ లైన్ అని పిలవబడే రైలు సర్వీసింగ్‌లో చాలా సేపు అంతరాయం కలిగింది. దీని కారణంగా ప్లాట్‌ఫారమ్‌పై పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. ఆ వీడియో కూడా నెట్టింట చక్కర్లు కొట్టింది. అయితే, ఇప్పుడు కూడా అలాంటిదే మరో వీడియో వైరల్‌గా మారింది. ఇది యునైటెడ్ కింగ్‌డమ్ నుండి విడుదలైనట్టుగా తెలిసింది. ముంబై లోకల్ ట్రైన్ ఎక్కేందుకు జనం ఎంతలా గుమిగూడారో అలాంటి సీనే లండన్ బస్సులో కనిపించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
లండన్ లాంటి దేశంలో ముంబై లాంటి జనాలు కనిపిస్తే ఆశ్చర్యం వేస్తుంది. లండన్‌లోని ఓ బస్సులో ప్రయాణించేందుకు భారీగా జనం గుమిగూడినట్లు వీడియోలో కనిపిస్తోంది. బస్సు ఆగిన వెంటనే ఎక్కేందుకు జనాలు ప్రయత్నిస్తున్నారు. కానీ అప్పటికే బస్సు నిండుగా ఉండడంతో జనం ఎక్కలేకపోతున్నారు. కొంతమంది పక్కనే నిలబడి, జనం క్లియర్ అయ్యే వరకు వేచి ఉన్నారు. కానీ అది జరగదు.
Trying to board the bus in ruislip is not for the weak pic.twitter.com/mw2gX74CPT
— UB1UB2 West London (Southall) (@UB1UB2) May 13, 2024
ఈ వీడియో @UB1UB2 అనే ఖాతాతో షేర్ చేయబడింది. ఈ వీడియో మే 13న Xలో షేర్ చేయగా, ఇప్పటి వరకు వీడియోని 15 లక్షల మంది కంటే ఎక్కువ మంది వీక్షించారు. వేల మంది దీన్ని లైక్ చేశారు. ఈ వీడియో చూసిన పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇది లండన్ అని ఒకరు రాశారు? లండన్‌లో ఇంత మందిని చూస్తానని ఊహించలేదన్నారు. ఇదేదో బెంగళూరు అనుకున్నాను అంటూ వ్యాఖ్యానించారు.
వీడియోపై మరికొందరు స్పందిస్తూ.. బ్రిటన్ మర్యాద మాసిపోయింది. వృద్ధులకు బస్సులో మొదటి స్థానం ఇచ్చే రోజులు పోయాయి అని ఒక వినియోగదారు వ్యాఖ్యానించారు. లండన్, భారతదేశం మధ్య తేడా లేదని, రెండు దేశాలలో రద్దీ సమస్య ఉందని ఒకరు రాశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..