Viral Video: నది వంతెనపై ఆగిన రైలు.. ప్రాణాలను పణంగా పెట్టిన లోకో పైలట్‌.. షాకింగ్ వీడియో..!

Viral Video: రైలు ప్రయాణికుడు చైన్‌ లాగిన సందర్భం ఓ లోకోపైలట్‌ ప్రాణం మీదికొచ్చింది. మహారాష్ట్ర ముంబై సమీపంలో ఈ ఘటన జరిగింది.

Viral Video: నది వంతెనపై ఆగిన రైలు.. ప్రాణాలను పణంగా పెట్టిన లోకో పైలట్‌.. షాకింగ్ వీడియో..!
Loco Pilot

Updated on: May 07, 2022 | 8:16 PM

Viral Video: రైలు ప్రయాణికుడు చైన్‌ లాగిన సందర్భం ఓ లోకోపైలట్‌ ప్రాణం మీదికొచ్చింది. మహారాష్ట్ర ముంబై సమీపంలో ఈ ఘటన జరిగింది. ముంబై నుంచి బీహార్‌లోని ఛాప్రాకు వెళ్తున్న గోదాన్ ఎక్స్‌ప్రెస్ రైలులోని ఒక ప్రయాణికుడు ఎమర్జెన్సీ చైన్‌ లాగాడు. దీంతో ముంబైకి 80 కిలోమీటర్ల దూరంలో ఒక నది వంతెనపై ఆ రైలు ఆగింది. చైన్‌ లాగిన రైలు బోగి కింద ఉన్న అలారం పరికరాన్ని తిరిగి సెట్‌ చేస్తేనే ఆ రైలు కదులుతుంది.

బోగి కింద ఉన్న అలారం పరికరాన్ని తిరిగి సెట్‌ చేసేందుకు సీనియర్ అసిస్టెంట్ లోకో పైలట్‌ సతీష్ కుమార్ చాలా రిస్క్‌ తీసుకున్నారు. రైలు ఇంజిన్‌లో ఉన్న ఆయన అతి కష్టం మీద చివరన ఉన్న రైలు బోగికి చేరుకున్నారు. వంతెనపై రైలు ఆగి ఉండటంతో ధైర్యం చేసి రైలు బోగి కిందకు వెళ్లి అక్కడ ఉన్న అలారం పరికరాన్ని తిరిగి సెట్‌ చేశారు. ఘటనపై స్పందించిన రైల్వే మంత్రిత్వ శాఖ అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే రైలు చైన్‌ని లాగాలని ట్విట్టర్‌లో సూచించింది.

కాగా, ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. లోకో పైలట్ సాహసం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఏమాత్రం తేడా వచ్చినా ప్రాణాలే పోయేలా అక్కడ పరిస్థితి ఉంది. అయినప్పటికీ బెదరకుండా.. రైలును స్టార్ట్ చేసేందుకు అతను చేసిన ప్రయత్నంపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. మరెందుకు ఆలస్యం ఈ షాకింగ్ వీడియోను మీరూ చూసేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us